నువ్వు ఇప్పటికిప్పుడు స్నానం చేయకపోతే వచ్చిన నష్టమేమి లేదు..ముందు అనుకున్న పని కానివ్వు..అర్జెంటుగా ..!

Kunchala Govind

చాలా మంది సెలబ్రిటీస్ తమ చర్మ సౌంద్రానికి వేలకి వేలు తగలేస్తుంటారు. సోప్స్, షాంపోస్, వాటర్, కాస్ట్యూంస్...వగైరా..వగైరా...వాటికోసం ఒక్కోసారి ఎంత తగలేస్తుంటారో తెలీదు. వాస్తవంగా సెలబ్రిటీస్ పెట్టే నెలవారీ ఖర్చులతో ఒక చిన్న కుటుంబం దాదాపు నాలుగైదు నెలలు గడిపేస్తారు. అంతగా మేయింటైన్ చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక సెలబ్రిటీ మాత్రం అందరికంటే భిన్నంగా ఉంది. ఈవిడ రోజు చేసే పని తలచుకుంటే ఖచ్చితంగా అసహ్యించుకుంటారు.

 

ఈ అమ్మాయి పేరు లేడీ గాగా. ఇంటర్నేషనల్ పాప్ సింగర్. ఈ బ్యూటి పాటలు కోట్ల రూపాయల్లో అమ్ముడుపోతుంటాయి. అయితే లేడీ గాగా నిస్సిగ్గుగా..అంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు పడకుండా తన గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఆమె స్నానం చేసి కొన్ని నెలలు గడుస్తున్నాయట. అయితే గాగా ఇలా నెలల తరబడి స్నానం చేయక్యండా ఉండటానికి బలమైన  కారణమే ఉందట. తన ఆరో ఆల్బమ్‌ను రూపొందించే పనిలో గాగా బిజీ అయిపోయారు. దాంతో ఉదయం లేవగానే స్టూడియోకి వెళ్లిపోతోందట. దాంతో తాను చివరిసారిగా ఎప్పుడు స్నానం చేసిందో కూడా గుర్తులేదట. ఇక ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ‘నా అసిస్టెంట్ నన్ను ఓ ప్రశ్న అడిగాడు. నువ్వు చివరి సారిగా ఎప్పుడు స్నానం చేశావని. నాకు గుర్తు లేదు అని చెప్పాను’ అని ట్వీట్ చేసింది ఈ పాప్ సింగర్ గాగా.

 

ఈ ట్వీట్‌కు ఏకంగా లక్షకుపైగా లైక్స్ వచ్చాయి. పైగా నెటిజన్స్ నుంచి వస్తున్న కామెంట్స్ మరీ విచిత్రంగా ఉన్నాయి. ఈకామెంట్స్ చూస్తుంటే సమాజంలో ఇలాంటి వింత విచిత్రమైన మనుషులు కూడా ఉన్నారా...! అని ఆశ్చర్యపోక మానరు. ‘నువ్వు ఇప్పటికిప్పుడు స్నానం చేయకపోయినా ఫర్వాలేదు ముందు త్వరగా ఆ ఆల్బమ్‌ను విడుదల చేసేయ్’ అని కామెంట్లు పెడుతున్నారు. దీనిని బట్టే అర్థమవుతోంది లేడీ గాగా విడుదల చేయబోయే ఆల్బమ్ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో. స్నానం సంగతి అటుంచితే కనీసం పళ్లైనా తోముకుంటోందో లేదో... లేదా అది మర్చిపోయిందో మరి. ఇక లేడీ గాగా నుంచి చివరి ఆల్బమ్ 2016లో వచ్చింది. అందుకే కాస్త లేటైనా లేటెస్ట్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను అలరించాలని తెగ కష్టపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: