గల్లీబాయ్‌ కి సినిమా ఛాన్స్

Dhana Lakshmi

ఓ గల్లీబాయ్‌ నిన్నామొన్నటి దాకా తన స్నేహితులతో కలిసి పాతబస్తీ వీధుల్లో తిరిగడు ఒకేసారి  బిగ్‌స్క్రీన్‌పై  నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. తొలుత ఈ కుర్రాడు ప్లేబ్యాక్‌ సింగర్‌గా చిత్ర సీమకు పరిచయమైన  బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌–3 విజేతగా నిలిచాడు రాహుల్‌ సిప్లిగంజ్‌. దాంతో  యూట్యూబ్‌ స్టార్‌గా నాలుగైదు వారాల నుంచి రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఇప్పుడు బుల్లితెర నుంచి వెండితెరకు రాహుల్‌ సిప్లిగంజ్‌  పరిచయం అవుతున్నాడు. రాహుల్‌ను ప్రముఖ స్టార్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ  వెండి తెరకు పరిచయం చేస్తూ సంచలనానికి కేంద్రబిందువయ్యారు. పక్కా లోకల్‌ బాయ్‌గా అభిమానులకు దగ్గరైన రాహుల్‌కు ఈ అవకాశం నిజంగా వరమనే చెప్పాలి.

 

'రంగమార్తాండ’ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు  ఇందులో అగ్రనటులు ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో కలిసి నటించే అరుదైన అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. రాహుల్‌ నిన్నటిదాకా బుల్లితెరపై సందడి చేసిన  ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుని అశేష అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు రాహుల్  నటుడిగా మారుతుండటంతో అటు పాతబస్తీతో పాటు ఇటు ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అభిమానులు అటు ట్విట్టర్‌లోనూ ఇటు ఇన్‌స్ట్రాగామ్‌లోనూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు .

 

రాహుల్‌ సోషల్‌ మీడియాలో రెండురోజుల నుంచి  మారుమోగిపోతున్నాడు. రాహుల్‌ దీనిపై స్పందించి రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌ లాంటి సీనియర్‌ నటులతో కలిసి నటించే అవకాశం రావడం తన జీవితంలో మరిచిపోలేని ఘటనగా  పేర్కొన్నాడు.రాహుల్‌  కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నాడు.

 

ఈ అవకాశం రావడం నిజం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. షూటింగ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని, నటుడిగా వెండితెరకు పరిచయం అవ్వడం నిజంగానే ఆనందంగా ఉందని మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరాడు. తన పాటలతో యువత మనసు దోచుకున్న నేను నటుడిగా మరింత సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడంటూ పేర్కొన్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: