మహేష్ సినిమాకు ఫ్లాప్ సెంటిమెంట్....?

Reddy P Rajasekhar

దర్శకుడు అనిల్ రావిపూడి మాటల రచయితగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ మొదలుపెట్టాడు. కందిరీగ సినిమా మాటలు, స్క్రిప్ట్ లో కూడా అనిల్ రావిపూడి ప్రమేయం ఉంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత శ్రీనువైట్ల మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన ఆగడు సినిమా రచయితల్లో ఒకరిగా అనిల్ రావిపూడి పని చేశారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది. మహేశ్ అనిల్ రావిపూడి ఇద్దరూ కలిసి పని చేసిన తొలి సినిమానే ఫ్లాప్ అయింది. 
 
కానీ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన అనిల్ రావిపూడి వరుస విజయాలను అందుకున్నాడు. తొలి సినిమా పటాస్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఆ తరువాత దర్శకత్వం వహించిన సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలు హిట్ అయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలన్నీ హిట్ కావడం, అనిల్ చెప్పిన కథ నచ్చటంతో మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 
 
ఆగడు సినిమా తరహాలోనే సరిలేరు నీకెవ్వరు సినిమా ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఆగడు సినిమా తప్పు రిపీట్ కాకుండా అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ ప్యాకేజీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మహేశ్ బాబుకు జోడీగా రష్మిక మందన్న ఈ సినిమాలో నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన సరిలేరు నీకెవ్వరు టీజర్ కు ఆరు రోజుల్లో 24 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 
 
2020 జనవరి 11వ తేదీన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు పోటీగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న అల వైకుంఠపురములో సినిమా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి. మహేశ్ బాబు అనిల్ రావిపూడి కలిసి పని చేసిన ఆగడు ఫ్లాప్ అయినా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తామని మహేశ్ బాబు, అనిల్ రావిపూడి నమ్ముతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: