బెల్లంకొండ తో  సినిమాకు భారీగా డిమాండ్ చేస్తున్న యంగ్ హీరోయిన్  

'నన్ను దోచుకుందువటే'తో టాలీవుడ్ లోకి  ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ నాభా  నటేష్.  ఈసినిమా యావరేజ్ గా ఆడినా ..  నాభా    నటనకు  మంచి  మార్కులు పడ్డాయి. ఈ చిత్రం తరువాత  ఆమెకు  డ్యాషింగ్ డైరెక్టర్  పూరి జగన్నాధ్ 'ఇస్మార్ట్ శంకర్' లో  ఓ హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు.  ఇటీవల విడుదలైన  ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈచిత్రంలో  గ్లామర్  పరంగా కూడా   మెప్పించింది  నాభా .  
 
 
 
ఈ సినిమా తరువాత   నాభా ప్రస్తుతం  మాస్ రాజా రవితేజ సరసన  'డిస్కో రాజా' లో నటిస్తుంది. ఈ సినిమా లో ఆమె క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా వుంటుందట. ఇక ఈ సినిమా  సెట్స్ మీద ఉండగానే  నాభా మరో రెండో  ప్రాజెక్ట్స్ కు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో   భాగంగా   సుప్రీం హీరో  సాయి తేజ్ తో  సోలో బ్రతుకే సో బెటర్  అనే    చిత్రంలో నటిస్తుంది . ఇటీవలే  ఈ చిత్రం యొక్క షూటింగ్ కూడా ప్రారంభమైంది.   నూతన దర్శకుడు  సుబ్బు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత  బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. 
 
 
 
ఇక ఈ చిత్రం తో పాటు తాజాగా  యంగ్ హీరో బెల్లంకొండ  సాయి శ్రీనివాస్ తో కలిసి నటించడానికి ఓకే చెప్పింది  నాభా నటేష్.  ఈ చిత్రంకోసం ఆమె ఏకంగా  కోటి రూపాయల  రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.  మేకర్స్ కూడా   ఆమె అడిగినంత ఇవ్వడానికి  ఒప్పుకున్నారని సమాచారం. రేపు  ఈ చిత్రం లాంచ్ అవుతుంది.  కందిరీగ ఫేమ్  సంతోష్ శ్రీనివాస్  తెరకెక్కించనున్న ఈ చిత్రానికి  రాక్ స్టార్  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.  సుమంత్ ఆర్ట్స్  ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: