'సాహో' ఎఫెక్ట్.... ప్రభాస్ ప్లేస్ లోకి మెగా హీరో.....??

Mari Sithara
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జాన్ తాజా షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. పూజా హెగ్డే తొలిసారి ప్రభాస్ ప్రక్కన జతకడుతున్న ఈ సినిమాకు జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు దీనిని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి. 1960 బ్యాక్ డ్రాప్ లో యూరోప్ లో జరిగిన రిట్రో ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇకపోతే ఈ సినిమా తరువాత ప్రభాస్ నటించబోయే తదుపరి సినిమా గురించి కొద్దిరోజలుగా పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. 

ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమా తీసి, యావరేజ్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి, ప్రభాస్ కోసం ఒక మంచి కథ సిద్ధం చేసుకుని, కొద్దిరోజుల ఆయనకు వినిపించడం, అలానే ప్రభాస్ కూడా ఆ కథ నచ్చడంతో వెంటనే చేయడానికి సిద్ధం అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే మధ్యలో ఏమి జరిగిందో ఏమో తెలియదు గాని, సురేందర్ రెడ్డి అర్ధాంతరంగా తన మనసు మార్చుకున్నట్లు నేడు వార్తలు వస్తున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ ని నేడు కలిసిన సురేందర్ రెడ్డి, ఆయనతో సినిమా చేయడం కోసం ఒక కథ సిద్ధం చేయనున్నారట. 

అయితే ఆయన ప్రభాస్ కోసం సిద్ధం చేసిన కథే, వరుణ్ తో చేస్తారా అనేది మాత్రం తెలియరాలేదు. కాగా దీనిపై నేటి ఉదయం నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. సాహో ఎఫెక్ట్ వల్లనే ప్రభాస్ తో సినిమాను సురేందర్ వద్దనుకున్నారు అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం అదేమీ లేదు, ప్రభాస్ నటిస్తున్న జాన్ సినిమా మరింత ఆలస్యం అవనుండడంతోనే సురేందర్ తన తదుపరి సినిమాని వరుణ్ తో చేయాలని నిశ్చయించారని, అలానే దాని తరువాత తప్పకుండా ప్రభాస్ తో చేస్తారని అంటున్నారు. అయితే ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం రావలసి ఉంది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: