ఈసారి మాత్రం నన్ను నమ్మండంటున్న రామ్ చరణ్.....!!

Mari Sithara
టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఓవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూ మరోవైపు తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై సినిమాలు కూడా నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మాస్ హిట్ రంగస్థలం లో చెవిటి వాటిగా చిట్టి బాబు అనే పాత్రలో నటించి, ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించిన చరణ్, ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. అయితే తన ప్రొడక్షన్ హౌస్ పై తొలిసారి తండ్రి మెగాస్టార్ తో ఆయన కం బ్యాక్ సినిమా అయిన ఖైదీ నెంబర్ 150 ని నిర్మించి, ఫస్ట్ మూవీతోనే మంచి సూపర్ హిట్ అందుకున్న చరణ్, 

ఇటీవల ఆయనతో కలిసి అత్యంత భారీ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో సైరా నరసింహారెడ్డి సినిమాను కూడా నిర్మించడం జరిగింది. మెగాస్టార్ ఎన్నో ఏళ్ల కలైన ఈ సినిమా ద్వారా చరణ్, ఆయనకు ఆశించిన మేర విజయాన్ని అందివ్వలేకపోగా, నిర్మాతగా ద్వితీయ విఘ్నాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఇక రెండవ సినిమా సైరా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కొంత ఆలోచనలో పడ్డ చరణ్, మరి కొద్దిరోజుల్లో మెగాస్టార్ మరియు కొరటాల కాంబోలో తెరకెక్కబోయే సినిమాను మాత్రం ఎంతో ప్లాన్డ్ గా పక్కాగా నిర్మించనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇక ఈ సినిమాను పక్కాగా కాస్ట్ కంట్రోల్ మేరకు నిర్మించనున్నారని, అలానే సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ చేసేలా మాస్, 

ఎంటర్టైన్మెంట్, మరియు కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా కథ విషయమై ఎంతో కేర్ తీసుకుంటున్నారని అంటున్నారు. ఇక ఇటీవల సైరాతో మెగాస్టార్ కు సరైన సక్సెస్ ఇవ్వలేకపోయిన తాను, ఈ సినిమాతో తప్పకుండా ఆయనకు మరొక బ్లాక్ బస్టర్ అందిస్తానని, ఆ విధంగా ఫ్యాన్స్ ని ఈ సారి మాత్రం తనను నమ్మమని ఆయన కోరుతున్నట్లు టాక్. ఇటీవల అధికారిక పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటివరకు కెరీర్ పరంగా ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని కొరటాల, ఈ సినిమాతో ఎంత మేర సక్సెస్ అందుకుంటారో చూడాలి....!!    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: