చిన్న హీరో చాన్స్ కొట్టేశాడు!

Chowdary Sirisha
హీరో అవ్వాలన్న ఆశ అందరికీ ఉంటుంది. కానీ ఏ కొందరికో ఆ అవకాశం దక్కుతుంది. కొందరికి అవకాశం దక్కినా... నిలదొక్కుకోవడం కష్టమవుతుంది. బాలాదిత్య ఈ మూడో రకం హీరో. అదృష్టవశాత్తూ హీరో అయ్యాడు కానీ... ఆ తర్వాత అతడితో అదృష్టం ఆడుకుంటూనే ఉంది.తండ్రి, అన్నయ్య నటులే కావడంతో చిన్న వయసులో మేకప్ వేసుకునే చాన్స్ వచ్చింది బాలాదిత్యకి. బాల నటుడిగా అందరినీ ఫ్లాట్ చేసేశాడు. అప్పుడే అతడికి హీరో అవ్వాలన్న కోరిక మనసులో ఫిక్సయిపోయింది. చంటిగాడు సినిమాతో ఆ కోరిక తీరింది. ఆ సినిమా విజయవంతమైనా ఆ తర్వాత బాలాదిత్యకు పరాజయాలే ఎదురయ్యాయి. రూమ్మేట్స్, వేట, జాజిమల్లి, నిన్ను చేరాలని అంటూ చాలా సినిమాలే చేశాడు. కానీ అవేవీ అతడిని నిలబెట్టలేకపోయాయి. దాంతో నిరాశలో కూరుకుపోయిన అతడికి ఓ మాంచి చాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. దర్శకుడు తేజ తదుపరి చిత్రంలో హీరోగా ఎంపికయ్యాడు బాలాదిత్య. దాంతో అతడి పంట పండినట్టయ్యింది. తేజ సినిమాల్లో నటించిన ఉదయ్ కిరణ్, నితిన్, గోపీచంద్ లాంటి వాళ్లంతా తర్వాత బిజీ అయిపోయారు. తను కూడా అలానే అవుతాను అని ఆశపడుతున్నాడు హీరోగారు. అయితే ఇటీవలే బాలాదిత్య విలన్ కూడా అయ్యాడండోయ్. ఓ తమిళ సినిమాలో నెగిటివ్ రోల్ లో చేయబోతున్నాడు. చూస్తుంటే ఈ సంవత్సరం ఎండింగ్ బాలాదిత్యకి మంచి మలుపే ఇచ్చినట్టుంది. వచ్చే యేడు చెలరేగిపోతాడేమో చిన్నోడు. ఆల్ ద బెస్ట్ బాలాదిత్యా!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: