ప్రేమలో పడాలని ఉంది ... కానీ పిల్లలు వద్దు

Yadav B Sridhar

ఫ్రాన్స్ కి చెందిన వ్యాపారవేత్త సీల్ ఆక్సెఫా తో కొంత కాలం డేటింగ్ చేసి విడిపోయిన బాలీవుడ్ హాట్ బ్యూటీ  మల్లికా షరావత్  మరోసారి ప్రేమలో పడాలని   అనుకుంటోందట... ఇప్పటికైతే తాను  సింగిల్ గానే ఉన్నానని చెబుతోంది .  మళ్ళీ ప్రేమలో పడాలని అనుకుంటున్నా మల్లికా షరావత్...    ఇండస్ట్రీలో ఎంతోమంది తనలాగే  సింగల్ గా జీవితాన్ని గడుపుతున్న  నటీమణులు  ఉన్నారని అంటోంది .


 ఇక ప్రేమలో పడాలనుకుంటున్న మల్లికా షరావత్  తనకు పిల్లలు మాత్రం వద్దు అని అంటోంది .  తన సోదరుడి కుమారుడు రణశేర్  అంటే తనకెంతో ఇష్టమని...  గంటలతరబడి వాడితో ఎంజాయ్ చేస్తాను  అంటూ చెప్పుకొచ్చింది.  తనకు పిల్లలు లేరు కాబట్టి రణశేర్ ను  కొడుకులా చూసుకుంటానని... వాడిని తనతోపాటు  విహారయాత్రలకు తీసుకు వెళుతూ ఉంటానాని  చెబుతోంది మల్లికా షరావత్.


  తనకు పిల్లలు వద్దని చెప్పడానికి అది ఎంతో బాధ్యతతో కూడిన ప్రక్రియ కావడమేనని చెబుతోంది ఈ హాట్ బ్యూటీ.  ఇప్పుడైతే సూట్ కేస్ సర్దుకొని ఎక్కడికైనా వెళ్ల వచ్చునని   అంటున్న మల్లికా షరావత్...  పిల్లలు పుడితే ప్రతిక్షణం వారి గురించి ఆలోచించాలని ,  వారిని ఏ స్కూల్లో చదివించాలన్న ఆలోచనతో పిచ్చెక్కిపోతుందని చెబుతోంది ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ . బాలీవుడ్ తో పాటు పలు హాలీవుడ్ చిత్రాల్లో మెరిసిన  మల్లికా షరావత్, సెక్సీ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనస్సులను కొల్లగొట్టింది .


బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ రష్మీ తో కలిసి మర్డర్ చిత్రం  ఆన్ స్క్రీన్ రొమాన్స్ లో రెచ్చిపోయింది మల్లికా షరావత్ .  ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద  సూపర్ , డూపర్ హిట్ అయింది . హిస్ , డర్టీ పాలిటిక్స్ వంటి హిందీ చిత్రాల్లో తనదైన సెక్సీ నటనతో మల్లికా షరావత్ ప్రేక్షకులను ఆకట్టుకుంది . 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: