చెత్త ట్వీట్ తో తిట్లు తిన్న పాక్ హీరోయిన్

Sirini Sita
మాములుగా ఒక మనిషి ఫేమస్ కావడం అంటే చాలా కష్టం.  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కాస్త వెసులుబాటు లభించింది.  కొంతమంది సోషల్ మీడియాను మంచి కోసం వినియోగించుకుంటుంటే.. మరికొన్నారు మాత్రం చెడు కోసం వినియోగిస్తున్నారు.  ఎలా కావాలంటే అలా వాడుకుంటూ మీడియాలో పాపులర్ కావాలని చూస్తున్నారు.  


కొంతమంది దేశం గురించి సమాజం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేస్తూ పాపులర్ అవుతుంటారు.  ఒక్కోసారి ఇవే మిస్ ఫైర్ అవుతుంటాయి.  నెటిజన్ల చేతిలో తిట్లు తినాల్సి వస్తుంది.  అయితేనేం పాపులర్ అయ్యామా లేదా అని చూస్తున్నారు.  మహేష్ పోకిరి సినిమాలో చెప్పినట్టుగా, ఎప్పుడు వచ్చామని కాదన్నయ్యా.. బులెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అనే డైలాగ్ ను దృష్టిలో పెట్టుకొని కామెంట్స్, ట్వీట్ చేస్తుంటారు.  


ఇదంతా ఏంటి బాసు అసలు విషయంలోకి రండి అంటున్నారా అక్కడికే వస్తున్నా.. పాక్ నటి వీణామాలిక్ బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది.  టాలీవుడ్ లో కూడా నటించింది.  హాట్ హాట్ ఫొటోలో సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటుంది.  ఇలాంటి ఈ నటి అప్పుడెప్పుడో ఓ వివాదాస్పద ట్వీట్ చేసి దెబ్బతిన్నది.  


మరలా ఇప్పుడు అలాంటి ట్వీట్ చేసి మరోసారి తిట్లు తిన్నది.  అసలు విషయం ఏమిటంటే.. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన విమానం ఒకటి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.  ఈ విమానం ఆచూకి కోసం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ గాలిస్తున్నాయి.  మూడు రోజులైనా దానిగురించి ఎలాంటి సమాచారం లేదు.  దీనిపై వీణామాలిక్ ట్వీట్ చేసింది.  విమానానికి మేఘాలు అడ్డు వచ్చాయని.. మేఘాల్లో చిక్కుకుపోయి ఉంటుందని ట్వీట్ చేస్తూ స్మైలీ గుర్తును పెట్టింది.  ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదా.. ఏ విషయం గురించి ఎలా మాట్లాడుతున్నావు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: