‘సర్కార్’పై భారీ అంచనాలే పెట్టుకున్నారు!

Edari Rama Krishna
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విజయ్ అంటే ఎంతో క్రేజ్ ఉంది.  సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో విజయ్.  విజయ్ నటించిన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.  ‘మెర్సల్’ తెలుగు లో అదిరింది చిత్రం ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించింది.  జీఎస్ టీ, వైద్య రంగంలో జరుగుతున్న అక్రమాల గురించి ఈ చిత్రంలో ఎంతో అద్భుతంగా వివరించారు.  ప్రముఖ దర్శకులు మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించిన ‘సర్కార్’ దీపావళి కానుకగా రాబోతుంది. 

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  తెలుగు లో కూడా సర్కార్ తెలుగు టీజర్ రిలీజ్ అయ్యింది.  రాజకీయ కోణంలో సాగే ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కోలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా 'సర్కార్' చిత్రాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. విజయ్ .. కీర్తి సురేశ్ జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే తమిళ నాట ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.