గమ్మత్తైన అందాలతో అదా...హాట్ పిక్

Vamsi

హార్ట్ ఎటాక్ సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించిన అందాల  భామ అదా శర్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకి తెలుగు చిత్ర సీమలో ఎలాంటి అవకాశాలు లేవు. అదా చాలామంది స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ఈ అమ్మడుకి టాలీవుడ్ లో బ్రేక్ దొరకలేదు. ఇక బాలీవుడ్ లో అప్పుడప్పుడు మెరుపు తీగలా మెరుస్తు వెళుతున్న అదా శర్మకి ప్రస్తుతం బాలీవుడ్ లో కమెండో మాత్రమే చేతిలో ఉంది. తెలుగులో క్షణం వంటి సినిమాలో ఫుల్ టాలెంట్ రోల్ చేసినా సినిమా హిట్ అవడంతో, అదా శర్మ కి మంచి పేరు రావడం ఏమో కానీ అవకాశాలే మొహం చాటేశాయి. కానీ ఈ అమ్మడు మాత్రం తన ప్రయత్నాల్లో ఎలాంటి లోపం రానివ్వదు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.


సోషల్ మీడియాను ఊపేస్తూ…. కుర్రకారుకు ఎప్పుడూ ఎదో ఒక హంగులతో తన అందాలను ఆరబోస్తూ, ఎప్పటికప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక అదా శర్మ యోగ యాక్టివిటీ తోనూ, హాట్ హాట్ ఫొటోస్ తోనూ సోషల్ మీడియా ని ఒక ఊపు ఆపేస్తుంది. అయినా అమ్మడిని పట్టించుకునే నాధుడు లేదు. ఏ ఒక్క దర్శక, నిర్మాత అదా శర్మ గురించి ఆలోచించే యోచన రావడంలేదు అంటే నమ్మశక్యం కాదేమో. అయితే తాజాగా అదా శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో మాత్రం పిచ్చెక్కిస్తుంది.


బ్లు కలర్ షార్ట్ మిడ్డీలో… లో నేక్ బ్లౌజ్ తో… ఎద అందాలతో….. బ్లు కలర్ జుట్టుతో ఒక లాంగ్ టాప్ వేసుకుని మత్తెక్కించే చూపులతో అదా శర్మ నిజంగానే పిచ్చెక్కిస్తుంది. అదా న్యూ లుక్ అంటూ సోషల్ మీడియాలో అదా ఫోటో వీర విహారం చేస్తుంది. మరి గ్లామర్ పరంగా ఎప్పుడు వెనక్కి తగ్గని అదా ఇలా తన హాట్ హాట్ పిక్స్ ని మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారు గుండె లయ తప్పేలా చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: