బరువును తగ్గించే గోధుమ గడ్డి జ్యూస్ !

Seetha Sailaja

 

రకరకాల ఆహారపు అలవాట్లతో పెరిగి పోయిన మన శరీర బరువును తగ్గించుకోవడానికి గోధుమగడ్డి జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.  ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు గోధుమ గడ్డి రసం తీసుకుంటే మనకు లభించే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

గోధుమ గడ్డిలో క్లోరోఫిల్ తో పాటు ముఖ్యమైన విటమిన్లు విటమిన్ ఏ, సి, ఈ, కాల్షియం,ఐరన్, మెగ్నీషియం,పొటాషియం లాంటి ఎన్నో పదార్ధాలు ఈ గోధుమ గడ్డిలో దొరకడంతో ఈ గడ్డితో తయారు చేసిన జ్యూస్ ఎంతో మేలును చేకూరుస్తుంది. ఈ గోధుమ గడ్డి ప్రతిచోట చాల సులువుగాను అదేవిధంగా చాల చౌకగాను దొరికే నేపధ్యంలో ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడం చాల సులువు.

 

అయితే మొదట్లో ఈ జ్యూస్ అలవాటు అయ్యే వరకూ ఆరుచిని ఆస్వాదించడం కొద్దిగా కష్టం కాబట్టి కొంచం శ్రమతో ఈరుచికి మనం అలవాటు పడగలిగితే ఈ జ్యూస్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే ఎవరికైనా షాక్ ఇస్తుంది. గోధుమ గడ్డిలో ఉండే సెలీనియం, థైరాయిడ్ గ్రంధి యొక్క పనితీరులో ప్రధాన భాగం పోషిస్తుంది.

 

మన శరీర బరువు నిర్వహణకి సహకరించడంలో థైరాయిడ్ ఎంతో అత్యంత ఆవస్యకమైన గ్రంధి అందుకే ఈ గ్రంధి ఆరోగ్యంగా పనిచేయడానికి,ఒక గ్లాసు గోధుమ గడ్డి రసం సహాయ పడుతుంది. ఇది తిరిగి శరీర బరువు తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఈ గోధుమ గడ్డి రసం వల్ల ఎక్కువగా తినాలి అన్న మన కోర్కెను మందగింప చేసి మన ఆకలిని బాగా తగ్గించి వేస్తుంది. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్న ఈ గోధుమ గడ్డి జ్యూస్ ను తీసుకోవడం మనకు అన్ని విధాల మంచిది అని లేటెస్ట్ ఆయుర్వేద అధ్యయనాలు తెలియ చేస్తున్నాయి.. 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: