తాప్సి కి కూడా తెలుగువాళ్ళు నచ్చరట....!

K Prakesh
ఆ మధ్య తెలుగు ప్రేక్షకులకు సరైన సినిమాలు చూసే అభిరుచి లేదంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన హీరో సిద్ధార్ద్, తరువాత తన మాటలను మీడియా వక్రికరించి౦దంటూ మాటలు మార్చాడు. ఈ మార్గం బాగుంది అని భావించింది కాబోలు చొట్ట బుగ్గల సుందరి తాప్సి కూడా తనకు తెలుగువాళ్ళు నచ్చరు అంటూ స్టేట్మెంట్స్ కొడుతోంది. ఈ మధ్య తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు దృష్టి కోలీవుడ్ పై పడింది.

అనుకోకుండా ఆమెకు రెండు సినిమాలు అక్కడ తగలడంతో ఏదో విధంగా తమిళ తంబిలను ప్రసన్నం చేసుకోవడానికి కొత్తమర్గాన్ని ఎంచుకుంది. ఈ మధ్య కోలీవుడ్ మీడియా లో తెగ హడావుడి చేస్తున్న తాప్సి, తెలుగు వాళ్ళు నటనను సహజంగా చేస్తే ఇష్టపడరని, వాళ్ళకి ఎప్పుడూ హీరోయిన్స్ గ్లామర్ డాల్స్ లా అందంగా కనిపించాలని, సహజత్వం కోసం కొద్దిగా పౌడర్ లేకుండా జిడ్డుమొహంతో కనిపిస్తే వెంటనే ఆ హీరోయిన్ ను లిస్టు లోంచి తిసివేస్తారని, అదే కోలీవుడ్ లో అయితే ఎంత సహజంగా ఉంటే ప్రేక్షకులు అంత ఆదరిస్తారని అంటూ కోలీవుడ్  ప్రేక్షకులకు హారతి ఇచ్చేస్తోంది తాప్సి.

ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లు, ప్రస్తుతం మన హీరోయిన్స్ అంతా ఏ భాషలో సినిమా చేస్తే ఆ సినిమా హీరోను, ఆ భాష ప్రేక్షకులను ఆకాశానికి ఎత్తేస్తూ, ఏదో విధంగా బ్రతికేద్దాం అని ప్రయత్నిస్తున్నారు. హీరోయిన్స్ కు అసలు మేకపే లేకుండా తెలుగు సినిమాలలో క్లాసిక్స్ గా మిగిలిపోయిన ‘ముత్యాల ముగ్గు’, ‘శారద’,’గోరంత దీపం’ లాంటి సినిమాల గురించి పాపం మన ఢిల్లీ బ్యూటీ కి తెలియదు అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: