నేటి ఫిలిం న్యూస్‌రౌండ‌ప్‌: సెప్టెంబ‌ర్ 30

Muddam Swamy
వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ‘బాహుబలి-2’: రాజమౌళి

స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ ఎస్‌ఎస్ రాజమౌళి మూవీ ‘బాహుబలి 2’ డీటైల్స్ పై అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. బాహుబలి 2 ను 2017 ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ ‘రెండు పాటలు మినహా బాహుబలి-2 షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ 5న అభిమానులను ఆశ్చర్యపరచనున్నాం. వర్చ్యువల్ రియాల్టీ ద్వారా ప్రేక్షకులను మాహిష్మతి రాజ్యంలోకి తీసుకెళ్లబోతున్నాం. మేము తయారు చేసిన ప్రత్యేక కార్ బోర్డు ద్వారా స్మార్ట్ ఫోన్లు వాడే ప్రతీ వ్యక్తి ఈ అనుభూతిని పొందుతాడని’ తెలిపారు. బాహుబలి వృక్షంలో ఎన్నో కొమ్మలున్నాయని, బాహుబలి ఆరంభం కాదు.. ముగింపు కాదని తెలిపాడు రాజమౌళి . 


‘హైపర్’తో వ‌చ్చిన రామ్


‘నేను శైలజ’తో సూపర్ హిట్ కొట్టిన రామ్, తాజాగా ‘హైపర్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మెప్పించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ దసరా సీజన్‌కు క్రేజ్ ఉన్న సినిమాల్లో ఒకటిగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమాకు రామ్‌కు కందిరీగ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. పాజిటివ్ టాక్ తో థియేట‌ర్ల‌లో ఈ సినిమా సంద‌డి చేస్తోంది. 


ఆడియ‌న్స్ ముందుకు ధోనీ


ఎం.ఎస్.ధోని.. భారతదేశంలో క్రికెట్ తెలిసిన ప్రతివ్యక్తికీ పరిచయం ఉన్న పేరు. భారత క్రికెట్‌కు తిరుగులేని విజయాలను అందించిన ధోని జీవిత కథతో బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే, ‘ఎం.ఎస్.ధోని – ది అన్‌టోల్డ్ స్టోరీ’ అనే సినిమాను తెరకెక్కించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోనీ పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  


పాక్‌లో భార‌త్ సినిమాలు బ్యాన్ 


భారత సినిమాల ప్రదర్శనను పాకిస్తాన్ నిలిపివేసింది. పాక్ ఆర్మీకి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ సినిమా థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ నిర్ణయం తీసుకున్న వాటిలో లాహోర్ లోని సూపర్ సినిమాస్ ముందు వరుసలో ఉంది. ఇది ఆ దేశంలో అతిపెద్ద సినిమా హౌజ్. తమ థియేటర్లలో ఇండియన్ సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు సూపర్ సినిమాస్ ఫేస్‌బుక్‌లో వెల్లడించింది. మరోవైపు పాకిస్తాన్ ఆర్టిస్టులను ఇండియన్ సిమాల్లో నటించనివ్వకుండా నిషేధించాలని ఐఎంపీపీఏ(ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్) డిమాండ్ చేసింది. దీన్ని బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ ఖండించారు. పాక్ అర్టిస్టులకు మద్దతుగా నిలిచారు. ఆర్టిస్టులు టెర్రరిస్టులు కాదని వ్యాఖ్యానించారు.  మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: