ఏపిహెరాల్డ్ : టుడే మూవీ న్యూస్ రౌండప్..!

shami

టైటిల్ సాంగ్ షూట్లో హైపర్ రామ్ :


ఎనర్జిటిక్ స్టార్ రామ్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న సినిమా హైపర్. కందిరీగ సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనీల్ సుంకరలు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ షూట్ ఈరోజు ప్రారంభించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ కంపోజింగ్ చేయబడుతుంది.  


నేను శైలజతో ఈ సంవత్సరం హిట్ తో శుభారంభం పలికిన రామ్ హైపర్ తో కూడా అదే రేంజ్ హిట్ అందుకుంటాడని చిత్రయూనిట్ చెబుతుంది. సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.  


ఫ్యామిలీతో చూసేశాడట :


యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే సెప్టెంబర్ 1 అమావాస్య కారణంగా మంగళవారమే తన ఫ్యామిలీతో జనతా గ్యారేజ్ స్పెషల్ షోని చూశారట ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీ.   


సినిమా చూసిన అందరు సినిమా సూపర్ హిట్ అనేస్తున్నారని టాక్. ఇక తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా జనతా గ్యారేజ్ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా తారక్ కెరియర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు.


ఇక జనతా గ్యారేజ్ మలయాళ వర్షన్ యు/ఏ సర్టిఫికేట్ అందుకుంది. తెలుగులో లేని 8 నిమిషాల సీన్ ఒకటి మలయాళంలో ఉంచడం జరిగింది. ఆ సీన్ మోహన్ లాల్ ప్రధానంగా జరిగే సన్నివేశాలని తెలుస్తుంది.


మరో ఐటం సాంగ్ :


ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే మరో పక్క ఐటం సాంగ్స్ లో ఇరగదీస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. మాస్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు స్టార్ సినిమాలో స్పెషల్ సాంగ్ అదేనండి ఐటం సాంగ్ కమపల్సరీ అయ్యింది. ఇప్పుడు అలాంటి సాంగ్స్ కు తాన్నా కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతుంది. 


ఇప్పటికే బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ నటించిన రెండు సినిమాల్లో ఐటం సాంగ్లో అలరించిన తమన్నా ఇప్పుడు కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ నటిస్తున్న తొలి సినిమా జాగ్వార్ లో కూడా ఓ హాట్ ఐటం చేస్తుందట. 70 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్న ఈ సినిమాలో ఐటం సాంగ్ కోసం తమన్నా భారీగానే డిమాండ్ చేసిందట. 


హాట్ రూమర్ :


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైది నెంబర్ 150వ సినిమాలో మెగా డాటర్ నిహారిక కూడా ఓ చిన్న పాత్ర చేస్తుందని టాక్. ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక సినిమా సక్సెస్ అవ్వలేదు కాని ఆమె అభినయానికి మంచి మార్కులు పడేలా చేసుకుంది.


ఇక పెదనాన్న సినిమాలో నటించాలని కోరిక బయట పెట్టడంతో సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నిహారిక కనిపించబోతుందని టాక్. అయితే చిత్రయూనిట్ మాత్రం ఈ విషయాన్ని డిక్లేర్ చేయలేదు.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: