మనీ: ఈ బిజినెస్ చేస్తే ఏడాది పొడవునా డబ్బే..!

Divya
ప్రస్తుత కాలంలో చాలామందికి ఒకచోట కుదురుగా కూర్చుని తినడానికి కూడా సమయం దొరకడం లేదు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తీరిక లేకుండా ఆఫీసుల్లోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇతర పనులు చేసే అంత సమయం కూడా బహుశా వారికి దొరకదేమో.. అంతేకాదు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తేనే ఇల్లు గడిచేది కష్టంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలలో పని చేసే వారికి సమయం అసలు సెట్ కావడం లేదు. ఎందుకంటే షిఫ్టుల్లో పనిచేయాల్సి వచ్చినప్పుడు భార్యాభర్తలకు కూడా ఇబ్బందికరంగా మారుతుంది మరొకవైపు ప్రైవేటు ఉద్యోగాలు ఉద్యోగ భద్రత కూడా లేకపోవడం మరో చింతించాల్సిన విషయం తెలిసిందే.
అందుకే మీకోసం బిజినెస్ ఐడియాను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీనివల్ల మీకు లాభాలే తప్ప నష్టం ఉండదు పైగా 365 రోజులు ఆదాయం పొందవచ్చు.. ఆ వ్యాపారం ఏదో కాదు బనానా చిప్స్ వ్యాపారం.. మీరు ముందుగా బనానా చిప్స్ తయారు చేయడానికి కొన్ని యంత్రాలు కొనుగోలు చేయాలి.. అరటిపండు చిప్ లను తయారు చేయడానికి అనేక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే వీటిలో అరటిపండు వాషింగ్,  పీలింగ్ మిషన్ , ఫ్రైయింగ్ మిషన్, మసాలా మిక్సింగ్ మిషన్ మొదలైనవి ఉన్నాయి. ఇకపోతే ఈ వ్యాపారానికి కావలసిన యంత్రాలను మార్కెట్ నుంచి లేదా ఆన్లైన్ ద్వారా మీరు కొనుగోలు చేయవచ్చు.
ఇకపోతే రూ.50,000 వరకు ఖర్చు చేస్తే సరిపోతుంది. ఇక అదే సమయంలో చిప్స్ చేయించడానికి మీకు 15 లీటర్ల నూనె కూడా అవసరం అవుతుంది. మార్కెట్ లెక్క ప్రకారం సుమారుగా 2500 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇక చిప్స్ తయారు చేసిన తర్వాత దానిపై చల్లుకోవడానికి ఉప్పు మసాలాలు కూడా అవసరం అవుతాయి. దీని ధర సుమారుగా రూ.200. ఇక ఒక కిలో బనానా చిప్స్ ప్యాకెట్ 70 రూపాయలు ఖర్చు చేస్తారు.  కానీ 50 కిలోల చిప్స్ తయారు చేసేందుకు ₹3,500 వెచ్చించాల్సి ఉంటుంది. ఒక కిలోకి 120 రూపాయల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు.  మీరు ఒక ప్యాకెట్ పై 20 రూపాయలు లాభం పొందినా అంతకుమించి ఆదాయం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: