లక్కంటే ఇతనిదే.. బ్యాంక్ అకౌంటే లేదు.. కోటి రూపాయలు వచ్చాయి?

praveen
లచ్చిందేవి.. ఎప్పుడు ఎవరి తలుపు తడుతుంది అన్నది అటు ఊహకందని విధంగానే ఉంటుంది. ఇలా ఏకంగా అదృష్టం రూపంలో లక్ష్మీదేవి కటాక్షం లభించి రాత్రికి రాత్రే ఎంతోమంది సామాన్యులు కోటీశ్వరులుగా మారిపోతున్న ఘటనలు కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయ్. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి తల్లి నీకు మేమే ఎక్కువ పూజలు చేశాం.. మాపై కటాక్షం చూపించలేవా అని ఎంతోమంది మనసులో అనుకుంటున్నారు కూడా. ఇక్కడ లక్ష్మీదేవి కటాక్షం లభించి ఒకసాదాసీదా ఆటో డ్రైవర్ రాత్రికి రాత్రి కోటీశ్వరుడు గా మారిపోయాడు. కేవలం 39 రూపాయల పెట్టుబడితో జాక్పాడ్ కొట్టేశాడు అని చెప్పాలి.

 అయితే అతనికి ఇప్పటివరకు కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. కానీ కోటి రూపాయలు గెలుచుకున్నాడు అని చెప్పాలి. బీహార్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నౌషాద్ అన్సారీ అనే ఒక ఆటో డ్రైవర్ ఇక ఆటో నడుపుతూ కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు. ఆటో తప్ప ఇక ఆ కుటుంబానికి మరో ఆదాయం లేదు. వచ్చిన దాంతో కేవలం నాలుగు పూటలా కుటుంబం తినడానికే సరిపోతుంది. దీంతో కష్టాల కడలిలో వారి జీవితం సాగుతుంది. ఇకపోతే ఇటీవల బుధవారం జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్ ద్వారా నౌషాద్ కు ఏకంగా కోటి రూపాయల బహుమతి వచ్చింది.

 ఈ మ్యాచ్ కు ముందు అతను ఏకంగా 39 రూపాయలతో ఆన్లైన్లోనే ఒక యాప్ లో టీం ను సెట్ చేసి బెట్టింగ్ పెట్టాడు. ఇందులో అందరికంటే అతనికి ఎక్కువ పాయింట్లు రావడంతో.. ఏకంగా కోటి రూపాయల ప్రైస్ మనీ గెలుచుకున్నాడు అని చెప్పాలి. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే అతనికి ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ కూడా లేకపోవడం గమనార్హం. డబ్బు గెలుచుకున్న తర్వాతనే అతను బ్యాంకులో ఖాతా తెరిచాడు. అనంతరం యాప్ వాలెట్ నుంచి డబ్బును అకౌంట్ కి బదిలీ చేయగా అన్ని టాక్స్ లు పోను 70 లక్షలు చేతికి వచ్చాయని నౌషాద్ చెప్పుకొచ్చాడు. ఇక తన కష్టాలు తీరిపోయాయని సంతోషం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: