మనీ: ఎస్బిఐలో సూపర్ స్కీం.. నిర్వాహకులకు ఈ స్కీం తో లక్షాధికారి ఖాయం..!

Divya

దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తమ కష్టమర్లకు అనేక రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తూ వారికి ఆర్థికంగా భరోసా ఇస్తోంది ఈ క్రమంలోని రికరింగ్ డిపాజిట్ ఖాతా సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా కష్టమర్లు లక్షాధికారులుగా మారవచ్చు అని ఇప్పటికే చాలామంది ప్రూవ్ చేశారు. ఇకపోతే ఎస్బిఐ రికరింగ్ డిపాజిట్ ల పై వడ్డీ ప్రస్తుతం 6.75% వరకు లభిస్తున్న నేపథ్యంలో కాల వ్యవధి ఆధారంగా వడ్డీ రేట్లు కూడా మారుతాయి అని మీరు గుర్తించుకోవాలి.

ఒకటి నుంచి రెండు సంవత్సరాల వ్యవధిలో 6.75% వరకు మీరు వడ్డీ పొందుతారు కాబట్టి వడ్డీ రేటు అనేది మారుతూ ఉంటుంది సీనియర్ సిటిజనులకు ఈ పథకం ద్వారా 7.25% వడ్డీ లభిస్తున్న నేపథ్యంలో ఈ పథకాలు సీనియర్ సిటిజెన్లకు మంచి ఆదాయాన్ని  అందిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక భరోసా ఇవ్వడానికే ఈ పథకాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే మీరు భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ఈ పథకాలు చక్కటి ఆదాయాన్ని అందిస్తున్నాయని చెప్పవచ్చు.
ఇకపోతే 10 సంవత్సరాల కాలవ్యవధితో ఎస్బిఐలో రికరింగ్ డిపాజిట్ ఖాతాను ఓపెన్ చేశారు అని అనుకుంటే ప్రతినెలా మీరు 6200 రూపాయలను అంటే రోజుకు 200 రూపాయలను ఆదా చేస్తూ వెళితే నిర్ణీత సమయం ముగిసేసరికి నీ చేతికి పది లక్షల రూపాయలు వస్తాయి మీరు కట్టిన డబ్బుకి 6.75% వడ్డీ కూడా జమ అవుతుంది. కాబట్టి మీ ఆదాయం రెట్టింపు అవుతుంది పైగా ఈ రికరింగ్ డిపాజిట్ స్కీం ద్వారా లక్షాధికారి అవడం కచ్చితంగా జరుగుతుంది. రికరింగ్ డిపాజిట్ ఓపెనర్లు ఆటో డెబిట్ ఫీచర్ ని కూడా పొందుతారు దీని కారణంగా మీరు ప్రతి నెల డబ్బు కట్టాల్సిన పని లేకుండా మీ ఖాతా నుండీ డబ్బు నేరుగా కట్ అవుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: