మనీ: రూ.50 వేల పెట్టుబడితో అదిరిపోయే లాభాలు..!

Divya
ఇటీవల కాలంలో చాలామంది ఉద్యోగం చేయడంలో ఇబ్బంది పడుతుంటే.. మరి కొంతమంది ఉద్యోగం లేక మరింత ఇబ్బంది పడుతున్నారు.. అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ సమయాన్ని వృధా చేసుకోవడం కంటే.. చదువుకు తగ్గ ఉద్యోగం లభించలేదని బాధపడడం కంటే .. ఆదాయం ఏరకంగా వస్తుందనే ఆలోచన మొదలైతే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవ్వచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించి.. మీ కెరీర్ ను బిల్డ్ చేసుకోండి. ఇటీవల కాలంలో ఫుడ్ బిజినెస్ మించిన వ్యాపారం మరొకటి లేదు.
ఎందుకంటే ఇటీవల కాలంలో వీక్ అండ్ కల్చర్ అన్నది బాగా పెరిగిపోయింది ..సాయంకాలం పూట భార్య , భర్త,  పిల్లలు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్లి వెరైటీ రుచులను చూడడానికి జనం ఎక్కువగా అలవాటు పడుతున్నారు.  అంతేకాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను మొదలుకొని చదువుకునే విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం పూట స్నాక్స్ కోసం తెగ ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. అయితే వారి అభిరుచులనే మీరు వ్యాపారంగా మార్చుకొని డబ్బు సంపాదించవచ్చు. స్నాక్స్ రూపంలో ఎన్ని ఐటమ్స్ లభించినా పావ్ బాజీకి ప్రత్యేకమైన స్థానం ఉంది.  చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తినే వంటకం ఇది.
మహారాష్ట్రకు చెందిన వంటకం అయినప్పటికీ ప్రస్తుత కాలంలో అందరూ దీనిని ఇష్టపడుతున్నారు.
ఇకపోతే ఈ వ్యాపారం పెట్టుబడి కి కేవలం  రూ.50000 ఉంటే సరిపోతుంది.. ముందుగా ఒక షాపును రెంటుకు తీసుకొని లేదా ఒక స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకున్న సరిపోతుంది.  కమర్షియల్ గ్యాస్ స్టవ్ అవసరం పడుతుంది అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కూడా సరిపోతుంది. కాలేజీలు, పార్కుల దగ్గర , ఆఫీసుల దగ్గర ఇలాంటి వ్యాపారం మొదలు పెడితే చక్కగా వర్క్ అవుట్ అవుతుంది కేవలం రూ.50 వేల పెట్టుబడితో మీరు ప్రతిరోజు 10,000 రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి దగ్గరే ఉంటూ కూడా ఇలాంటి వ్యాపారాన్ని చేస్తూ డబ్బు సంపాదించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: