మనీ: ఏపీ విద్యార్థులకు శుభవార్త.. ఈ పథకంలో కొత్త మార్పులు..!

Divya
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై పూర్తిగా ఫోకస్ పెడుతోంది. ముఖ్యంగా విద్యా , వైద్య రంగాలపై ఎక్కువగా ఖర్చు చేయాలన్నదే లక్ష్యంగా దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పేద విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించడమే తమ ప్రధాన అజెండా అంటూ పదేపదే చెబుతున్నారు కూడా.. ఇందులో భాగంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ఇప్పటికే అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. ఇప్పుడు ఉన్న వాటిలో కూడా కొత్తగా మార్పులు చేస్తున్నారు. జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పథకాలలో జగనన్న గోరుముద్ద కూడా ఒకటి.
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. జగనన్న గోరుముద్దలో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు ఒకటి చొప్పున మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు అందిస్తున్నారు.  ఇటీవల కొన్నిచోట్ల మధ్యాహ్న భోజనంలో అందించే గుడ్డు నాణ్యత లేకపోవడం , పాడైపోయిన గుడ్లు విద్యార్థులకు పెట్టడంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ పథకంలో కీలక మార్పులు చేసింది ప్రభుత్వం. పది రోజులకు ఒకసారి పాఠశాలలకు సరఫరా చేస్తున్న గుడ్లకు బదులుగా వారానికి ఒకసారి గుడ్లను సరఫరా చేయాల్సిందిగా ఆదేశించింది.
కోడిగుడ్ల నాణ్యత చెడిపోకుండా.. తాజా గుడ్లు అందించే విధంగా వారానికి ఒకసారి కోడిగుడ్ల సరఫరా చేయాలి అని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం పై అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రతి వారం వచ్చే గుడ్లకు నాలుగు రంగుల స్టాంపులు వేస్తారు.  గుడ్ల సరఫరా లో అక్రమాలకు తావు లేకుండా మొదటి వారం నీలం.. రెండో వారం గులాబీ.. మూడో వారం ఆకుపచ్చ.. నాలుగవ వారం వంగ పువ్వు రంగులతో గుడ్లపై స్టాంపింగ్ చేయనున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పగడ్బందీగా నాణ్యతతో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: