మనీ: రైతులకు శుభవార్త.. రేటు అధికమవుతున్న ఎర్ర బంగారం.!!

Divya
ముఖ్యంగా ఈ ఏడాది వ్యవసాయ సీజన్ ఆరంభం నుంచి బంగారంతో పోటీపడిన ఎర్ర బంగారం అనగా మిరపకాయలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలి అంటే బంగారం ధరలని క్రాస్ చేసిందని చెప్పవచ్చు. వరంగల్లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా ఎండుమిర్చి ధర 66 వేల రూపాయలు పలికింది. ఎర్ర బంగారం సాగు చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు కావడం విశేషం. ఇకపోతే ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డులలో ఒకటైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈ రికార్డు ధర నమోదవడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా టమోటా రకం మిర్చికి ఈ ధర లభ్యమైంది అని సమాచారం. దుగ్గొండి మండలం మరిపెళ్లి గ్రామానికి చెందిన యార రవి అనే రైతు సాగుచేసిన 24 బస్తాల టమాటా రకం మిర్చిని కోల్డ్ స్టోరేజ్ లో బద్రపరిచాడు. ఆ మిర్చిని ఈరోజు విక్రయించగా క్వింటాకు రూ. 66, 000 రికార్డు ధర పలికింది. ఇక ఈ విషయం తెలుసుకున్న సదరు రైతు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యంగా మన దేశంతో పాటు విదేశాల్లో కూడా ఈ మిర్చికి బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక మన దేశంతో పాటు విదేశాలలో కూడా ఈ మిర్చికి బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా దేశీ మిర్చిని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అకాల వర్షాలు,  వైరస్ కారణంగా ఈ ఏడాది మిర్చి పంట తీవ్రంగా దెబ్బతినింది. దీంతో పంట దిగుబడి కూడా తగ్గింది .. కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచిన మిర్చికి ఇప్పుడు రికార్డు ధర పలకడం  గమనార్హం. ఇక వరంగల్లో ఎక్కువగా పండించే ఈ మిర్చిని ఇప్పుడు ధరలు చూసి చాలామంది ఇదే రకం ఎండుమిర్చిని పండించడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: