మనీ: రూ. 5 లక్షల విలువ చేసే ఉచిత బీమా.. ఎలా అంటే..?

Divya
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఎన్నో పథకాలు స్కీములు అందుబాటులోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో చాలా మంది ఈ పథకాలను ఉపయోగించుకోవాలని తక్కువ మొత్తానికే వీటిని అమలు చేస్తూ ఉండటం గమనార్హం. ఇక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఏదో ఒకటి స్కీము మోడీ ప్రభుత్వం ఉంచుతోంది అందులో భారత పౌరుల కోసం అందించిన స్కీం లలో ఉచిత ఆరోగ్య భీమా కూడా ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకం ద్వారా ఇప్పటికే ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు ఏ బి హెచ్ ఏ హెల్త్ కార్డును కూడా ఇవ్వడం జరుగుతుంది.

ప్రస్తుతం ఈ కార్డును పొందడానికి వెబ్ సైట్ ఓపెన్ కూడా అయింది. ఇక ఈ పథకం కింద రిజిస్టర్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఐదు లక్షల రూపాయలను మనం పొందవచ్చు. ఇకపోతే ఇందులో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ను టైపు చేసి సబ్మిట్ చేస్తే.. ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది. ఇక ఆ ఓటిపి మళ్లీ టైప్ చేసి ఆ తర్వాత ఫోన్ నెంబర్ ని కూడా టైప్ చేయమని అడుగుతుంది. ఇక మళ్లీ ఫోన్ నెంబర్ నమోదు చేసిన తర్వాత ఇంకొక ఓటిపి వస్తుంది. ఓ టీ పీ కూడా నమోదు చేసిన తర్వాత ఫోటో తో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డు మీరు క్షణాలలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ హాస్పిటల్ లో హెల్త్ కార్డు చెల్లుబాటులో ఉంటుంది. ఇక మీరు కూడా అప్లై చేసి అతి కొన్ని నిమిషాల లో హెల్త్ కార్డు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: