మనీ ప్లాంట్ తో పాటు ఈ 5 మొక్కలు ఇంట్లో ఉండాల్సిందే ?

VAMSI
మని ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ధనధాన్యాలతో, భోగభాగ్యాలతో తుల తూగుతుందని , ఆ ఇంటికి ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు ఎదురు కావని మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు చెబుతూ ఉంటారు. అయితే కొందరు వీటిని నమ్మకపోయినా ఎక్కువ మంది మాత్రం వీరిని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. దీనితో దాదాపు అందరి ఇళ్లలోనూ మని ప్లాంట్ ఉండనే ఉంటుంది. కొందరు షో కోసం ఈ మొక్కను పెంచుకుంటే ఇంకొందరు డబ్బులను ప్రసాదించే మొక్కగా భావించి ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటారు. లక్ష్మి దేవితో సమానంగా భావించి ఎంతో పవిత్రంగా ఈ మొక్కను పెంచుతూ పూజలు పునస్కరాలు చేస్తుంటారు.
అయితే మనీ ప్లాంట్‌తో పాటు మీ ఇంట్లో లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుని మన ఇంట్లో తిష్ట వేయించే చెట్లు మరికొన్ని కూడా ఉన్నాయి. వీటిని మీ ఇంటి ఆవరణలో పెంచుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది.  ఆర్దికంగా ఎటువంటి కొరత లేకుండా ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం పదండి.
దానిమ్మ మొక్క, వెదురు మొక్క,
దానిమ్మ రుచి, ఆరోగ్య పరంగా మాత్రమే కాకుండా, గుమ్మడి తీగ, బిల్వ మొక్క, వెదురు మొక్క లను పెంచుకోవడం వలన లక్ష్మి దేవి మన ఇంట కొలువై ఉంటుంది. వీటిని ఇంటి ఆవరణలో పెంచుకోవడం వలన ఆ కుటుంబానికి
డబ్బుకు కొరత ఉండదు.
మొక్కలు ఇంటిని అందంగా ఉంచడమే కాదు, ఇంటి ఆనందానికి, శ్రేయస్సుకు కూడా ప్రతీకగా నిలుస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా  ఇంట్లో మొక్కలు నాటడం చాలా శుభప్రదం. అందుకే ఇంట్లో ఈ మొక్కలను పెంచుకుని లక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకోండి. అటు ఆరోగ్యం ఇటు ఆర్దికంగా కూడా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ ఇంట్లో కనుక ఈ మొక్కలు లేకుంటే త్వరగా ఏర్పాటు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: