మహిళలకు మరొకసారి తమ ఖాతాలో డబ్బు జమ చేయనున్న ప్రభుత్వం ..!!

Divya
జగనన్న ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు మరొకసారి తీపికబురు అందించింది... గత ప్రభుత్వంతో పోల్చుకుంటే.. నా ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని వాగ్దానాలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన వాగ్దానాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మహిళలు ఎవరిపై ఆధారపడకుండా తన కేబినెట్లో ఎంతో మంది ఆడవారికి మంత్రులుగా పదవులను కేటాయించిన ఆయన రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళ కూడా ఆర్థికంగా మగవారిపై ఆధార పడకుండా ఉండాలని లక్ష్యంగా పెట్టుకొని బడుగు, బలహీన వర్గాల కోసం అలాగే ప్రతి ఒక్క మహిళ బాగుకోసం ఏపీ ప్రభుత్వం పాటుపడుతుంది.
ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఒంగోలులో పర్యటించనున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇక ఈ పర్యటనలో భాగంగానే వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇక ఈ క్రమంలోని ఈరోజు ఉదయం 9:30 గంటలకు తన నివాసం తాడేపల్లి నుంచి బయలుదేరి పివిఆర్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ కు చేరుకోవడం జరిగింది. భద్రతా దళాల సంరక్షణలో జగన్ మోహన్ రెడ్డి జాగ్రత్తగా పీ వీ ఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ కు చేరుకున్నారు. ఇక అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగం పూర్తి చేసుకున్న తర్వాత వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత కింద పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రారంభించనున్నారు.
డ్వాక్రా మహిళల బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించి వడ్డీని ఈ పథకం ద్వారా విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఇందులో భాగంగానే డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించి తీసుకున్న వడ్డీని ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇక ఇందులో భాగంగానే కోటి మంది మహిళలకు తమ ఖాతాల్లో సున్నా వడ్డీ పథకం 1260 కోట్లను సీఎం జగన్ ఒంగోలు నుంచి జమ చేయనున్నారు. ఇక ఈ సొమ్ముతో ఇప్పటిదాకా రూ.3,60,015 కోట్లను మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందించినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: