నెలకు రూ. 5000 చెల్లిస్తే చాలు... లక్షలు మీ సొంతం?

VAMSI
డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ ఒక చక్కటి సోర్స్ అనే చెప్పాలి. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు ఆదా చేసుకునేందుకు సుకన్య యోజన, రికరింగ్ వంటి చాలా స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు దాచుకోవడం అంటే రిస్క్ లేని పని. ఎటువంటి ఇబ్బందీ లేకుండా డబ్బులు సేవ్ చేసుకుంటే ఆ మొత్తానికి స్కీమ్ షరతులు ప్రకారం అంతకుమించి డబ్బు మనకు వస్తుంది. దీనిలో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. మెచ్యూరిటీ సమయంలో అధిక మొత్తం వస్తుంది. అయితే పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి.
ఇది స్మాల్ సేవింగ్ స్కీమ్.
అయితే ఈ స్కీం వలన చాలా బెనిఫిట్ అని సదరు పోస్ట్ ఆఫీస్ ప్రతినిదులు చెబుతున్నారు. ఇంతకీ ఈ స్కీమ్ వివరాలేంటో ఇపుడు చూద్దాం.  ఈ స్కీమ్ ను కనుక సక్రమంగా వినియోగించుకుంటే వినియోగదారుడు రూ.8 లక్షలు పొందొచ్చు. అయితే అందుకు నెలకు 5 వేల రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎంతో మంది ఈ స్కీం లో భాగస్వామ్యులు అయి ఉన్నారు. ఈ స్కీమ్‌లో కోసం ఒక్క సారిగా పెద్ద మొత్తంలో డబ్బులు కట్టనక్కర్లేదు. నెల నెలా కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. అలా కంటిన్యూగా ఇచ్చిన పీరియడ్ వరకు డబ్బులు కడుతూ వస్తే మెచ్యూరిటీ సమయానికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు వినియోగదారుడు పొందవచ్చు.
సామాన్యుడికి అందుబాటులో ఉండే స్కీం లలో ఇదీ ఒకటి అనే చెప్పాలి. 18 సంవత్సరాలకు పైబడిన స్త్రీ, పురుషులు ఎవరైనా సరే అర్హులు. ఈ స్కీం లో చేరి నెలకు రూ.100 నుంచి డిపాజిట్ చేసినా చాలు. ఈ స్కీమ్ యొక్క వడ్డీ రేటు వివరాలు చూడగా..  ప్రస్తుతం 5.8 శాతం ఇస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కట్టిన మొత్తాన్ని బట్టి ఈ వడ్డీ రేట్లు మారుతాయి.  స్కీమ్‌లో చేరిన అభ్యర్దులు ఐదేళ్ల వరకు వారి డబ్బులను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. కావాలంటే మరో ఐదేళ్లు కూడా పెంచుకునే అవకాశం ఉంది.   అంతేకాదు ఇన్వెస్ట్ చేసిన డబ్బును మీరు లోన్ గా తీసుకునే సౌకర్యం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: