మనీ : తక్కువ పెట్టుబడి తో రూ. 30 వేలు లాభం..

Divya

కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ డబ్బు లేక చాలా కష్టాలు పడుతున్నారు. ఇక ఇలాంటి సమయంలో బయటికి వెళ్లి ఉద్యోగం చేయాలన్నా కూడా భయపడుతున్నారు. ఇందుకు కారణం ఎవరి నుండి ఎప్పుడు , ఎక్కడ , ఎలా మనకు కరోన వైరస్ సోకుతుందో అనే  భయపడుతూ,  ఇంట్లోనే వర్క్ చేసుకోవడం మంచిదని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే మరికొంతమంది సొంతంగా వ్యాపారం మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇక అలాంటి వారికోసం ఇప్పుడు ఒక సరికొత్త వ్యాపారం మీకు అందుబాటులోకి తీసుకు వచ్చాము. ఆ వ్యాపారం ఏమిటంటే టీ పొడి తయారీ వ్యాపారం.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఈ టీ తాగనిదే వారికి ఉదయం మొదలవ్వదు. అలాంటప్పుడు నీళ్ల తర్వాత ఎక్కువ మొత్తంలో ఖర్చు అయ్యేది ఈ టీ అని చెప్పవచ్చు. అందుకే ఈ టీ పొడి వ్యాపారం మొదలు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఈ టీ వ్యాపారం మొదలు పెట్టాలంటే ముందుగా రూ .5000 పెట్టుబడి పెడితే సరిపోతుంది. కేవలం తక్కువ మొత్తంతో వ్యాపారాన్ని మొదలుపెట్టి కృషి, పట్టుదల ఉండి వ్యాపారాన్ని చక్కగా చేసుకోవడం వల్ల అత్యధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

అంతేకాదు ఈ వ్యాపారాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కూడా లభిస్తుంది. ముఖ్యంగా మన భారత దేశంలో వివిధ ప్రాంతాలలో తేయాకు తోటల పెంపకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా డార్జిలింగ్ టీ అలాగే అస్సాం టీ లు  చాలా ఫేమస్ పొందాయి. విదేశాలలో కూడా ప్రజలు వీటి రుచికి బాగా అలవాటుపడ్డారు. అందుకే ఈ రెండు రకాల ఆకులను పొడి రూపంలో తయారు చేసి అమ్మడం వల్ల మంచి ప్రయోజనం పొందవచ్చు. హోమ్ డెలివరీ, టీ షాప్స్, కేఫ్ అలాగే హోల్ సేల్ మార్కెట్లో కూడా వీటిని విక్రయించవచ్చు. దాదాపుగా నెలకు తక్కువలో తక్కువ రూ.30,000 లాభం గా పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వ్యాపారంలోని మెళకువలు తెలుసుకుని మొదలుపెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: