మనీ : ఎంత దాచాలని అనుకున్నా..డబ్బులు దాయలేక పోతున్నారా..? అయితే ఇలా చేయండి..

Divya

డబ్బు ప్రతి ఒక్కరికి నిత్య అవసరం. ప్రస్తుత కాలంలో గాలి పీల్చాలి అన్నా,  నీరు తాగాలి అన్నా, భోజనం చేయాలన్నా డబ్బు కంపల్సరిగా ఉండాల్సిందే. అందుకే డబ్బును ఇదః జగత్ అని అన్నారు. డబ్బు లేకుంటే ఏ పని చేయలేము. అందుకే మనలో చాలామంది డబ్బులు దాచి పెట్టాలని కలలు కంటూ ఉంటారు. అందులో భాగంగానే కొన్ని సులువైన మార్గాలను కూడా ఎంచుకుంటూ ఉంటారు. కొంతమంది పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు దాచుకుంటే, మరి కొంతమంది ఎల్ఐసి ల పేరిట డబ్బును ఆదా చేసుకుంటున్నారు. మరికొంతమంది వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు.. అయితే ఏమి చేసినా కొంతమంది దగ్గర డబ్బులు నిలవలేక పోతోంది అని బాధపడుతూ ఉంటారు. అయితే వారు ఎక్కడ డబ్బులు వృధా చేస్తున్నారో తెలియక సతమతమవుతూ ఉంటారు.. అలాంటి వారి కోసమే ఇప్పుడు ఒక కొన్ని మార్గాలను మీ ముందుకు తీసుకు వచ్చాము.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1.తక్షణం అవసరం లేని వస్తువులను కొనకూడదు.
2. అప్పు చేస్తే,అప్పులు తీర్చడానికి,వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి.
3. ప్రతిరోజు కొంత డబ్బును ఒక హుండీలో వేసుకోండి. వారానికి ఒకసారి ఈ డబ్బు మొత్తం తీసి, బ్యాంకులో జమ చేసుకోవడం ఉత్తమం. అంతేకాకుండా అవసరమైతే తప్ప ఈ మనీ బయటకు తీయకూడదని నియమం కూడా పెట్టుకోండి.
4. ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం ఎక్కువ అయింది. కాబట్టి టీవీ చూసేవారు కూడా తక్కువగా ఉంటారు. అందుకే కేబుల్ టీవీ కనెక్షన్ కూడా తగ్గించుకోవడం మంచిది.
5. బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కోవడం, బయట భోజనం చేయడం వంటి పద్ధతులను మానుకోండి. చిన్న మొత్తం నుంచి కూడా డబ్బులు ఆదా చేయడాన్ని అలవాటు చేసుకోవచ్చు.
6. కొంతమందికి అవసరం లేకుండా కూడా ఆన్లైన్ నుంచి వస్తువులను కొనుక్కోవడం లాంటి అలవాటు ఉంటుంది. కాబట్టి అనవసరంగా ఏ వస్తువులను తీసుకోవడానికి ముందుకు వెళ్ళదు.

కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించి,చిన్న మొత్తంలో డబ్బు ఆదా చేయడం అలవాటు చేసుకుంటూ పోతే చివరకు ఎక్కువ మొత్తంలో ఆదా చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: