హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: చేవెళ్ళ ఎమ్మెల్యేకు మళ్ళీ ఛాన్స్ ఉందా?

ఇప్పుడంటే తెలంగాణలో టీడీపీకి ఫ్యూచర్ లేదు గాని..ఒకప్పుడు మాత్రం టీడీపీ అద్భుత విజయాలే సాధించింది...అలాగే టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు కూడా చాలానే ఉన్నాయి..అలా టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో చేవెళ్ళ కూడా ఒకటి. 1985, 1994, 1999, 2009 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. అయితే మూడుసార్లు దివంగత ఇంద్రారెడ్డి టీడీపీ నుంచి గెలిచారు...ఇక ఈయన తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చి 1999 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన మరణంతో సబితా ఇంద్రారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2000 ఉపఎన్నికలో చేవెళ్ళ నుంచి గెలిచారు...2004 ఎన్నికల్లో కూడా ఆమె సత్తా చాటారు.
2009లో చేవెళ్ళ ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గంగా మారడంతో సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికి మారిపోయారు. అయితే 2009లో చేవెళ్ళలో టీడీపీ తరుపున కే‌ఎస్ రత్నం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లోకి వెళ్ళి 2014లో పోటీ చేశారు..కానీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కాలే యాదయ్య చేతిలో ఓడిపోయారు. అలా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన యాదయ్య తర్వాత టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. దీంతో 2018లో యాదయ్య టీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా, రత్నం కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు..కానీ విజయం యాదయ్యని వరించింది. ఇలా రెండుసార్లు ఎమ్మెల్యేగా యాదయ్య గెలిచారు. నగరానికి దగ్గరగా ఉన్న చేవెళ్ళలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగానే జరుగుతున్నాయి...అటు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేకు బాగా ప్లస్ అవుతున్నాయి.
అయితే ఎమ్మెల్యేగా యాదయ్య పర్వాలేదనిపిస్తున్నారు...పైగా రాజకీయంగా బలమైన ప్రత్యర్ధులు లేకపోవడం ఎమ్మెల్యేగా బాగా అడ్వాంటేజ్ అవుతుంది..అటు కే‌ఎస్ రత్నం సైతం కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ వీక్‌గా కనిపిస్తోంది..అటు బీజేపీకి కూడా ఇక్కడ పెద్ద పట్టున్నట్లు కనిపించడం లేదు..దీంతో ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్యకు తిరుగులేని పరిస్తితి ఉందని చెప్పొచ్చు. మరి వచ్చే ఎన్నికలనాటికి కాంగ్రెస్, బీజేపీలు పికప్ అయితే యాదయ్యకు చెక్ పెట్టొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: