హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కిషోర్‌కు అద్దంకి ఈ సారి ఛాన్స్ ఇచ్చేలా లేరు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో తుంగతుర్తి ఒకటి. ఈ నియోజకవర్గంలో మెజారిటీ సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే రాష్ట్రం విభజన జరిగాక అంటే 2014 నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఏ మాత్రం కలిసిరావడం లేదు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతూ వస్తుంది. అది కూడా స్వల్ప మెజారిటీ తేడాలతోనే..రెండుసార్లు కూడా దాదాపు రెండు వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్...టీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ చేతిలో ఓడిపోతున్నారు.
బేసిక్‌గా కిషోర్ రాజకీయాల్లోకి వచ్చింది 2010లో...అప్పుడు టీఆర్ఎస్‌లోకి వచ్చి రాజకీయం చేస్తూ వస్తున్నారు. అలాగే 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టిక్కెట్ దక్కించుకుని సత్తా చాటుతూ వస్తున్నారు. ఇలా రెండుసార్లు గెలిచిన కిషోర్....తుంగతుర్తి నియోజకవర్గంలో ఏమైనా మార్పులు తీసుకొచ్చారా? అంటే రాష్ట్ర విభజన తర్వాత కాస్త మార్పులు వచ్చాయనే చెప్పాలి. కాస్త సాగునీటి ఇబ్బందులు తగ్గాయి. అలాగే సరికొత్త సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి.
కాకపోతే ఇక్కడ తాగునీటి సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టలేకపోయారు. రూరల్ ప్రాంతం కావడంతో రోడ్ల అభివృద్ధి తక్కువ. పేరుకు ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం గానీ...ఇక్కడ ఎస్సీలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, మూడు ఎకరాల భూమి పెద్దగా అందలేదు. ఇప్పుడు దళితబంధు ఏమైందో తెలియదు. ఇక ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండేది కూడా తక్కువే అని తెలుస్తోంది.
ఓవరాల్‌గా చూసుకుంటే రెండుసార్లు గెలిచిన కిషోర్‌పై కాస్త ప్రజా వ్యతిరేకత పెరిగినట్లే కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఉన్నారు. రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి ఈయనకు ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ వాయిస్‌ని బలంగా వినిపించే నాయకుడు. ప్రజా సమస్యలపై గళం గట్టిగానే విప్పుతారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్‌కు మళ్ళీ ఛాన్స్ వచ్చేలా లేదు. ఇక్కడ బీజేపీకి పెద్దగా బలం లేదు. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ.  

మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: