హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కోమటిరెడ్డి...’కారు’కు అడ్వాంటేజ్ ఇస్తున్నారా?




ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పేరు చెబితే చాలు...కోమటిరెడ్డి బ్రదర్స్ గుర్తొస్తారు. అంటే అంతలా వారు జిల్లాలో కాంగ్రెస్‌ని పైకి లేపారని చెప్పొచ్చు. దశాబ్దాల కాలం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇక మొదట్లో అన్నకు సపోర్ట్‌గా ఉంటూ..ఆ తర్వాత నుంచి తాను కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం సత్తా చాటుతూ వస్తున్నారు.
అన్న సపోర్ట్‌తో ముందుకొచ్చిన రాజగోపాల్...2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున భువనగిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో రాజగోపాల్‌కు రాజకీయంగా ఎదగడానికి మంచి ఛాన్స్ దొరికింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో సైతం రాజగోపాల్...భువనగిరి ఎంపీగానే బరిలో దిగారు. కానీ అనూహ్యంగా స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికలోచ్చేసరికి రాజగోపాల్...మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
మామూలుగా మునుగోడు నియోజకవర్గంలో ఎప్పుడు కాంగ్రెస్-సి‌పి‌ఐల మధ్య హోరాహోరీ పోరు జరిగేది. నియోజకవర్గం ఏర్పాడ్డాక ఇక్కడ కాంగ్రెస్ 6 సార్లు గెలిస్తే..సి‌పి‌ఐ ఐదు సార్లు గెలిచింది. అంటే రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండేది. రాష్ట్రం విడిపోయాక సి‌పి‌ఐ జోరు తగ్గింది. 2014లో మునుగోడులో టి‌ఆర్‌ఎస్ గెలిచింది. 2019 ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ గెలిచింది. ఇక కాంగ్రెస్ తరుపున రాజగోపాల్ గెలిచారు.
అయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండటంతో అనుకున్న పనులు చేయలేకపోతున్నారు. కానీ ప్రజలకు అండగా ఉండటంలో ముందు ఉంటున్నారు. ఇక్కడ రాజగోపాల్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. కాకపోతే రాజగోపాల్ గెలిచిన దగ్గర నుంచి కాంగ్రెస్‌లో సరిగ్గా ఉండటం లేదు. ఆ పార్టీ పరిస్తితి దిగజారిపోతూ వస్తుండటంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. మధ్యలో బీజేపీలోకి వెళ్లిపోతానని కూడా మాట్లాడారు.
కానీ ఇంతవరకు ఆయన పార్టీ మారలేదు. అలా అని కాంగ్రెస్‌లో యాక్టివ్ గా ఉండటం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఈ మధ్య పార్టీలో యాక్టివ్ అయ్యారు..రేవంత్ రెడ్డితో సఖ్యతతో ఉంటున్నారు. అయినా సరే రాజగోపాల్ రూట్ మాత్రం అర్ధం కావడం లేదు. ఈయన నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారో..లేక బీజేపీలోకి వెళ్తారో తెలియడం లేదు.
అటు ఏమో టీఆర్ఎస్ తరుపున పని చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి...నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా మునుగోడులో గెలవాలని చూస్తున్నారు. ఇటు రాజగోపాల్ ఏమో నిలకడగా రాజకీయం చేయడం లేదు. ఇలాంటి పరిస్తితుల్లో మునుగోడులో టీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: