హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కన్నబాబు బాగానే క్లిక్ అయ్యారు!

ఏపీ మంత్రుల్లో కాస్త మంత్రిగా బాగా క్లిక్ అయిన వాళ్ళల్లో కన్నబాబు కూడా ఒకరని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్ క్యాబినెట్‌లో ఉన్నవారిలో చాలామంది మంత్రులు....మంత్రులనే సంగతి జనాలకు తెలియదు. పైగా సరైన పనితీరు కూడా కనబర్చరు. కానీ ఈ రెండు విషయాల్లో కన్నబాబు చాలా బెటర్. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు...త్వరగానే తన శాఖపై పట్టు తెచ్చుకున్నారు. మిగతా మంత్రులతో పోలిస్తే...కన్నబాబు తన శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పరిస్తితులు తెలుసుకుంటారు.
వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఆహారశుద్ధి పరిశ్రమలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీటింగులు పెడతారు. అయితే నిధులు కొరత ఈ శాఖలో ఎక్కువగా ఉంది అందుకే పనులు ఎక్కువ జరగడం లేదు. అలాగే ఫుడ్‌ ప్రొసెసింగ్‌ పాలసీ రూపకల్పనలో, ప్రకృతి వ్యవసాయ విధాన రూపకల్పనలో కీలకంగా పనిచేస్తున్నారు.
వ్యవసాయ శాఖలో కొత్త మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అయితే ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టాలు జరిగినప్పుడు ఆదుకుంటామని మాట ఇస్తారు గానీ, రైతులని పూర్తి స్థయిలో ఆదుకున్న దాఖలాలు లేవు. ఇక రైతులకు సంబంధించి జగన్ ప్రభుత్వం అనేక పథకాలని అందిస్తుంది గానీ, ఇప్పటికీ రైతుల జీవితాలు బాగుపడలేదు. కానీ మొత్తం మీద చూసుకుంటే మంత్రిగా కన్నబాబుకు మంచి మార్కులే పడుతున్నాయి.

ఇటు కాకినాడ రూరల్‌లో ఎమ్మెల్యేగా కూడా కన్నబాబు బాగానే పనిచేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ...అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. రాజకీయంగా ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలకు కౌంటర్లు ఇవ్వడంలో ముందున్నారు. నియోజకవర్గంలో కన్నబాబు స్ట్రాంగ్‌గానే ఉన్నారు...కానీ టీడీపీ-జనసేనలు గానే కలిస్తే నెక్స్ట్ ఎన్నికల్లో కన్నబాబుకు చెక్ పడిపోవచ్చు.
ఎందుకంటే గత ఎన్నికల్లో కన్నబాబుకు టీడీపీపై వచ్చిన మెజారిటీ కంటే జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. ఒకవేళ అప్పుడే టీడీపీతో జనసేన కలిస్తే కన్నబాబు గెలుపుకు ఇబ్బంది అయ్యేది. మరి నెక్స్ట్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిస్తే ఏం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: