హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ టీడీపీ ఎమ్మెల్యేకు ఈ సారి కష్టమే అనుకుంటా!

ఏపీలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి...ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపుని ఆపడం చాలా కష్టమని చెప్పాలి...ఎలాంటి ఎదురుగాలులు వీచిన ఆ నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగుతూనే వస్తుంది... గత ఎన్నికల్లో అంతటి జగన్ గాలిలో సైతం పలు కంచుకోటల్లో టీడీపీ జెండా ఎగిరింది...అలాంటి కంచుకోటల్లో ఉండి నియోజకవర్గం కూడా ఒకటి.
ఇక్కడ టీడీపీకి గెలుపు గురించి తప్ప, ఓటమి గురించి అంతగా తెలియదనే చెప్పాలి..పార్టీ పెట్టిన దగ్గర నుంచి అంటే 1983 నుంచి 2019 వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం ఒకసారి మాత్రమే ఓడిపోయింది....8 సార్లు ఉండిలో టీడీపీ జెండా ఎగిరింది. గత ఎన్నికల్లో సైతం పార్టీ సత్తా చాటింది. టీడీపీ తరుపున మంతెన రామరాజు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రామరాజు...ఈ రెండున్నర ఏళ్లలో ఎలాంటి పనితీరు కనబర్చారు..ప్రజా సమస్యలపై ఎలాంటి పోరాటం చేశారు? అనే విషయాలని ఒక్కసారి గమనిస్తే...ఎమ్మెల్యేగా రామరాజుకు యావరేజ్ మార్కులు పడుతున్నాయనే చెప్పాలి.
అనుకున్న మేర ప్రజలకు అండగా ఉండటంతో సక్సెస్ అయినట్లు కనిపించడం లేదు. ఉండి పక్కనే ఉండే పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిత్యం ప్రజల్లోనే ఉంటూ, వారికి ఎలా అండగా ఉంటున్నారో చెప్పాల్సిన పని లేదు. అయితే ఆయన స్థాయిలో రామరాజు మాత్రం పనిచేయడం లేదనే చెప్పాలి. పైగా ఈయన లోపల వైసీపీతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు కూడా తెలుస్తోంది.
అయితే ఉండిలో టీడీపీ బలం ఏమి తగ్గలేదు...కాకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో ఈయనకు సీటు ఇచ్చే విషయంలో డౌట్ ఉంది. ఎందుకంటే ఇది వేటుకూరి శివరరామరాజు సీటు..2009, 2014 ఎన్నికల్లో ఆయనే గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో సడన్‌గా చంద్రబాబు...వేటుకూరిని నరసాపురం ఎంపీగా పంపించి, రామరాజుని ఉండి బరిలో నిలబెట్టారు. అప్పుడు వేటుకూరి ఓడిపోగా, రామరాజు గెలిచారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో వేటుకూరి మళ్ళీ ఉండి వచ్చి పోటీ చేస్తారని తెలుస్తోంది. కాబట్టి నెక్స్ట్ రామరాజుకు సీటు దొరకడం కష్టమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: