హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు అవే మైనస్...

గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో చాలామంది నాయకులు భారీ మెజారిటీలతో ఎమ్మెల్యేలుగా గెలిచేశారు. అయితే జగన్ ఇమేజ్‌తో గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు సొంత ఇమేజ్ పెంచుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అలా సొంత ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిలో గుంతకల్లు ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు.


గత ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి దాదాపు 48 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇంత మెజారిటీ రావడానికి ప్రధాన కారణం జగన్ ఇమేజ్ మాత్రమే అని చెప్పొచ్చు. అలా జగన్ ఇమేజ్‌తో గెలిచిన వెంకట్రామిరెడ్డి తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. నిత్యం ప్రజల మధ్యలోనే తిరుగుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రభుత్వం తరుపున జరిగే అన్నీ కార్యక్రమాలు గుంతకల్లు నియోజకవర్గంలో జరుగుతున్నాయి.
గుంతకల్లులో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు, నాడు-నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి, జగనన్న కాలనీల ద్వారా పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే నిధులు వచ్చిన మేరకు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి నియోజకవర్గంలో పనిచేయిస్తున్నారు. అయితే రెండేళ్లలో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగలేదు. ఇక నియోజకవర్గంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గుంతకల్లు పట్టణంలో తాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అటు ఇళ్ల స్థలాల్లో వైసీపీ నేతలు అక్రమాలు ఎక్కువగానే ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాలు అన్నీ వైసీపీ ఎమ్మెల్యేకు నెగిటివ్ అయ్యేలా కనిపిస్తున్నాయి.
ఇటు టీడీపీ తరుపున జితేంద్ర గౌడ్ నియోజకవర్గంలో బాగానే పనిచేస్తున్నారు. పార్టీని మళ్ళీ బలోపేతం చేసి, నెక్స్ట్ ఎన్నికల్లో గెలిపించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అటు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో వైసీపీ బలంగానే ఉంది గానీ, గత ఎన్నికల్లో ఉన్న పరిస్తితి మాత్రం లేదు. ఇదే సమయంలో టీడీపీ నిదానంగా పుంజుకుంటే వైసీపీ ఎమ్మెల్యేకు ఇబ్బందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: