హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: డాక్టర్‌గారికి నల్లమిల్లితో ఇబ్బందేనా?

సాధారణంగా రెడ్డి సామాజికవర్గం నేతలు ఆధిక్యం రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాలో ఉంటుంది. కానీ గోదావరి జిల్లాల్లో రెడ్డి నాయకులు ప్రభావం తక్కువ. కానీ తూర్పు గోదావరిలో రెడ్డి నాయకుల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అనపర్తి. గత మూడు దశాబ్దాల నుంచి ఇక్కడ రెడ్ల హావానే కొనసాగుతుంది. అధికారమైన, ప్రతిపక్షమైన రెడ్డి నేతలే ఉంటున్నారు. గత రెండు పర్యాయాలు నుంచి ఇక్కడ టీడీపీ, వైసీపీల నుంచి ఇద్దరు రెడ్డి నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు.


2014 ఎన్నికల్లో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి తనయుడు రామకృష్ణారెడ్డి బరిలో దిగగా, వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి మేనల్లుడు డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి పోటీ చేశారు. అయితే స్వల్ప మెజారిటీతో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఓడిపోయిన సూర్యనారాయణ రెడ్డి , నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేశారు.


ఆ కృషి ఫలితమే 2019 ఎన్నికల్లో సూర్యనారాయణ, రామకృష్ణారెడ్డిపై దాదాపు 55 వేల మెజారిటీతో గెలుపొందారు. స్వతహాగా డాక్టరైన సూర్యనారాయణ, సొంత ఆసుపత్రి పెట్టి గత మూడు దశాబ్దాల నుంచి అనపర్తి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజల ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టి వారికి పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఎక్కువ హడావిడి చేయకుండా సైలెంట్ గా పనిచేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.


ఇప్పుడు కరోనా వ్యాప్తి పెరగకుండా తన నియోజకవర్గ ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు బాగా అడ్వాంటేజ్ అవుతున్నాయి. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీనే డామినేట్ చేసింది.


ఇక ఇక్కడ టీడీపీని రామకృష్ణారెడ్డి నడిపిస్తున్నారు. ఈయన నిత్యం అధికార పార్టీపై పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాగే ఆ మధ్య అవినీతి ఆరోపణల విషయంలో ఎమ్మెల్యే, నల్లమిల్లి మధ్య ప్రమాణాల పర్వం నడిచింది. అయితే గత ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నల్లమిల్లిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దానివల్ల ఇంకా ఈయన నియోజకవర్గంలో పుంజుకోలేదు. పైగా ఈ మధ్య ఓ హత్యా కేసులో నల్లమిల్లి జైలుకు వెళ్లొచ్చారు. అయితే జగన్ ప్రభుత్వమే కావాలని కేసులో ఇరికించిందని టీడీపీ నేతలు ఆరోపించారు. మరి ఈ కేసు వల్ల నల్లమిల్లికి ఏమన్నా సానుభూతి పెరిగి ఎమ్మెల్యేకు ఇబ్బంది అవుతుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: