హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ సీనియర్ ఎమ్మెల్యేకు కేబినెట్ బెర్త్ ఫిక్స్?
అంటే మరో ఏడాదిలో జగన్ కొత్త కేబినెట్ ఏర్పాటు చేస్తారు. ఇక విస్తరణలో ఛాన్స్ దక్కించుకోవచ్చని పలువురు సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేలు చూస్తున్నారు. అయితే అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కూడా జగన్ కేబినెట్లో ఛాన్స్ రావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి అనంతపురం జిల్లా నుంచి శంకర్ నారాయణ ఒక్కరే కేబినెట్లో ఉన్నారు. దీంతో జిల్లాలో మరొకరికి రావొచ్చు. ఈ క్రమంలోనే అనంత వెంకట్రామిరెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి.
దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్లో పనిచేసిన అనంత...నాలుగుసార్లు అనంతపురం ఎంపీగా గెలిచారు. 1996, 1998, 2004, 2009ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున అనంతపురం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే తర్వాత వైఎస్ మరణం, జగన్ వైసీపీ పెట్టడంతో అటు వచ్చేశారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున అనంతపురం ఎంపీగా పోటీ చేసి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
2019 ఎన్నికల్లో అనంతపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి, టీడీపీ నేత ప్రభాకర్ చౌదరీపై 28 వేలపైనే ఓట్లతో విజయం సాధించారు. అయితే ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటంతో, అనంత ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబరుస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. రూ. 80 కోట్లతో నియోజకవర్గంలో ఉన్న డ్రైనేజ్ సమస్యకు చెక్ పెట్టారు. ఇక నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పాతూరులోని పాత పోస్టాఫీస్ నుండి తడకలేరు వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు.
ఎమ్మెల్యేగా దూకుడుగా ఉన్న అనంతకు మంత్రి పదవి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇక్కడ టీడీపీ నేత ప్రభాకర్ చౌదరీ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. నిత్యం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. అధినేత పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కార్యకర్తలని కలుపుకుని పోతూ...పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు.