హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: శ్రీకాంత్ అడ్డాగా రాయచోటి...అడ్రెస్ లేని టీడీపీ..
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం.. 1955లో ఆవిర్భావమైంది. నాటి నుంచి నేటి వరకు 16 సార్లు రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించగా ఎక్కువసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే జయకేతనం ఎగురవేశారు. ఇక రెండు సార్లు మాత్రం టీడీపీ గెలిచింది. సుగవాసి పాలకొండ్రాయుడు ఆ పార్టీ తరుపున గెలిచారు. అయితే అంతకముందు సుగవాసి జనతా పార్టీ నుంచి ఒకసారి, ఇండిపెండెంట్‌గా ఒకసారి విజయం సాధించారు.
ఇక 2009లో srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గడికోట శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ తరుపున తొలిసారి రాయచోటి బరిలో దిగి విజయం సాధించారు. అయితే వైఎస్ ఫ్యామిలీకు వీరవిధేయుడు అయిన శ్రీకాంత్...వైఎస్ మరణంతో జగన్ పెట్టిన వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు. అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2012 వచ్చిన ఉపఎన్నికల్లో శ్రీకాంత్ వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి దాదాపు 56 వేలపైనే ఓట్ల మెజారిటీతో గెలిచారు.
నెక్స్ట్ 2014, 2019 ఎన్నికల్లో కూడా శ్రీకాంత్ వరుసగా గెలిచేశారు. ఇలా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం, పైగా జగన్‌కు సన్నిహితంగా ఉండే నేత కావడంతో శ్రీకాంత్‌కు మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా శ్రీకాంత్‌కు మంత్రి పదవి దక్కలేదు. కాకపోతే కేబినెట్ హోదా ఉండే ప్రభుత్వ చీఫ్‌విప్ పదవి దక్కింది.
ఇటు ఎమ్మెల్యేగా, అటు చీఫ్‌విప్‌గా శ్రీకాంత్ రెడ్డి మంచి పనితీరు కనబరుస్తున్నారు. రాయచోటి ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కృషి చేస్తున్నారు. సమస్యలు ఉంటే అధికారులతో మాట్లాడి, వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల్లో ఎలాంటి లోటు లేదు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్న కూడా రాయచోటిలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు.
ఇంకా రాయచోటిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇది మరింత తీవ్రమైంది. ఇక సాగునీటి సమస్య కూడా ఎక్కువగానే ఉంది. కాకపోతే ఎన్ని సమస్యలు ఉన్నా రాయచోటి ప్రజలు శ్రీకాంత్ రెడ్డి వైపే ఉన్నారు. ఇక్కడ అసలు టీడీపీకి పెద్ద స్కోప్ లేదు. టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు ఎలాగో సైలెంట్ అయిపోయారు. గత ఎన్నికల్లో తన కుమారుడు ప్రసాద్ బాబుకు సీటు దక్కపోవడంతో ఆయన టీడీపీకి దూరం జరిగారు.
ఇక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ నేత రమేష్ కుమార్ రెడ్డి, ఏదో అలా అలా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ఆయనకు ఇప్పటికీ నియోజకవర్గంపై పట్టు దక్కలేదు. దీంతో రాయచోటిలో టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదు. మొత్తానికైతే రాయచోటి శ్రీకాంత్ అడ్డాగా మారిపోయింది.