హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కారు ఎమ్మెల్యేకు లక్ష్మణ్ చెక్?

తెలంగాణలో బీజేపీ వేగంగా పుంజుకుంటున్న విషయం తెలిసిందే...ఆ పార్టీ చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు పోటీగా వచ్చింది..ముఖ్యంగా జి‌హెచ్‌ఎం‌సి పరిధిలో బీజేపీ ఎక్కువ పుంజుకుందని చెప్పొచ్చు...ఆ మధ్య వచ్చిన జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల ఫలితాల్లోనే ఈ విషయం అర్ధమైందని చెప్పొచ్చు...అసలు దాదాపు టీఆర్ఎస్‌ని ఓడించినంత పనిచేసింది బీజేపీ. హోరాహోరీగా పొరాడి ఎడ్జ్‌లో జి‌హెచ్‌ఎం‌సిని కోల్పోయింది. ఆ ఎన్నికల బట్టి జి‌హెచ్‌ఎం‌సిలో బీజేపీ బలం ఏ మేర పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు.
జి‌హెచ్‌ఎం‌సి పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ బలం పెరిగింది..ఈ క్రమంలోనే ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ స్ట్రాంగ్ అయినట్లు కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న బీజేపీ సీనియర్ లీడర్ కె. లక్ష్మణ్...టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు..లక్ష్మణ్ గతంలో పలుమార్లు ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు...2004లో ఓడిపోయిన ఆయన..2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. ఇక 2014 ఎన్నికల్లో మరొకసారి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా గెలిచారు.
కానీ 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత ముఠా గోపాల్ చేతిలో ఓటమి పాలయ్యారు..అయితే టీఆర్ఎస్ తరుపున గెలిచిన గోపాల్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు..ఆయన ఏదో పర్వాలేదనిపించేలా పనిచేసుకుంటూ వెళుతున్నారు..ఎలాగో నగర పరిధిలో ముషీరాబాద్ ఉంది కాబట్టి...అభివృద్ధి బాగానే జరిగింది...కాకపోతే తాగునీరు, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి.
ఏదో పార్టీ బలమే తప్ప.. ముఠా గోపాల్‌కు ప్రత్యేకమైన బలం పెద్దగా లేదు..కానీ బీజేపీ నేత లక్ష్మణ్‌కు ముషీరాబాద్‌లో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది..అలాగే ఈయన రెండేళ్ళు ముందు వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేసిన విషయం తెలిసిందే. అధ్యక్షుడుగా రాణించిన లక్ష్మణ్...ఇప్పుడు కూడా బీజేపీ సీనియర్ నేతగా సత్తా చాటుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో మాత్రం ముషీరాబాద్‌లో గెలిచి తీరాలనే కసితో లక్ష్మణ్ పనిచేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ బలం కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. మొత్తానికి ఇక్కడ టీఆర్ఎస్-బీజేపీల మధ్యే ఫైట్ నడిచేలా ఉంది..మరి ఈ సారి కారు ఎమ్మెల్యేకు లక్ష్మణ్ చెక్ పెడతారేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: