హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పద్మారావు గౌడ్‌కు ఎదురులేనట్లేనా?

పద్మారావు గౌడ్ తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కరలేని పేరు..ముఖ్యంగా హైదరాబాద్ రాజకీయాల్లో మొదట నుంచి టీఆర్ఎస్ బలోపేతం కోసం పనిచేస్తున్న నాయకుడు..హైదరాబాద్‌లో కాంగ్రెస్, టీడీపీల హవా ఉన్న సమయంలోనే టీఆర్ఎస్ తరుపున పోరాడిన నేత పద్మారావు. అలా పార్టీ కోసం పనిచేసిన పద్మారావు ఇప్పుడు సికింద్రాబాద్ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడుగా ఉన్నారు..అక్కడ ఈయనకు చెక్ పెట్టే ప్రత్యర్ధి కూడా కనిపించడం లేదు.
ఇలా తిరుగులేని నాయకుడుగా ఉన్న పద్మారావు రాజకీయ జీవితం కాంగ్రెస్‌లో మొదలైంది..అలాగే కాంగ్రెస్‌లో జి‌హెచ్‌ఎం‌సి కార్పొరేటర్‌గా పనిచేశారు...ఇక 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించడంతో..ఆ పార్టీలోకి వచ్చేశారు. టీఆర్ఎస్‌లోకి వచ్చాక కూడా కార్పొరేటర్‌గా గెలిచారు. ఇక 2004 ఎన్నికల్లో మొదటిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు..అయితే అప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు ఉండటం పద్మారావుకు కలిసొచ్చింది.
ఇక తెలంగాణ కోసం 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్ళగా, ఆ ఉపఎన్నికలో పద్మారావు ఓడిపోయారు...2009 ఎన్నికల్లో టీఆర్ఎస్-టీడీపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే...పొత్తులో భాగంగా సికింద్రాబాద్ సీటు టీడీపీకి దక్కింది...దీంతో పద్మారావు సనత్‌నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు..తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికలో పద్మారావు..మళ్ళీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు..అలాగే కేసీఆర్ క్యాబినెట్‌లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో కూడా మరోసారి సికింద్రాబాద్‌లో సత్తా చాటారు..అలాగే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా పనిచేస్తున్నారు.
అయితే పద్మారావు పెద్దగా వివాదాల జోలికి వెళ్లలేదు..అలాగే సికింద్రాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే రాజకీయంగా కూడా ఇక్కడ బలంగా ఉన్నారు...ఇక ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌లకు బలమైన క్యాడర్ ఉంది గాని..బలమైన నాయకులు ఉన్నట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో పోటీ చేసి ఓడిపోయిన కాసాని జ్ఞానేశ్వర్..ఆ పార్టీకి దూరం జరిగారు. మొత్తానికి కాంగ్రెస్, బీజేపీలకు బలమైన నాయకత్వం లేదని చెప్పొచ్చు...ఇదే పద్మారావు గౌడ్‌కు బాగా ప్లస్ అవుతుంది..మరి వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో సత్తా చాటుతారేమో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: