హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: సైదిరెడ్డి ‘కారు’ స్పీడ్ డౌన్?

ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం...2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హుజూర్‌నగర్ ఏర్పడింది. ఆ వెంటనే జరిగిన 2009 ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. అయితే అంతకముందు ఈయన కోదాడలో వరుసగా..1999, 2004 ఎన్నికల్లో గెలిచారు...2009లో హుజూర్‌నగర్ వచ్చి గెలిచారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఎదిగారు.
ఇక తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అలాగే 2018 ఎన్నికల్లో మరోసారి గెలిచి ఉత్తమ్... హుజూర్‌నగర్‌లో హ్యాట్రిక్ కొట్టారు. ఇలా హ్యాట్రిక్ కొట్టిన ఉత్తమ్...2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో హుజూర్‌నగర్ స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. అయితే టీఆర్ఎస్ అధికారంలో ఉండటం...అప్పటికే టీఆర్ఎస్ తరుపున ఓడిపోయిన సైదిరెడ్డికి సానుభూతి ఉండటంతో 2019లో వచ్చిన ఉపఎన్నికలో సైదిరెడ్డి భారీ మెజారిటీతో ఉత్తమ్ భార్య పద్మావతిపై విజయం సాధించారు.


అలా ఎమ్మెల్యేగా గెలిచిన సైదిరెడ్డి..తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు..ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందున్నారు. అలాగే చిన్నాచితక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదట్లో...కేసీఆర్ నియోజకవర్గానికి వచ్చి పలు వరాలు ఇచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఒక్కో గ్రామ పంచాయితీకి రూ.20 లక్షలు, 7 మండల కేంద్రాలకు రూ.30 లక్షలు, హుజూర్‌ నగర్‌ పట్టణానికి రూ. 25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటికీ రూ.15కోట్లు ఇచ్చారు.
అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు...పాలిటెక్నిక్ కాలేజ్, గిరిజన గురుకుల పాఠశాల, బంజారా భవన్ ఏర్పాటు చేస్తామన్నారు. అయితే ఈ హామీలు అమలయ్యేయో లేదో కూడా క్లారిటీ లేకుండా పోయాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పెద్దగా కట్టించలేదు. ఇక్కడ తాగునీటి సమస్యలకు చెక్ పెట్టలేదు. అలాగే మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఇలా నియోజకవర్గంలో పలు సమస్యలు ఉండిపోయాయి. ఇటు ఇక్కడ ఉత్తమ్ ఎప్పటికప్పుడు ప్రజలతో టచ్‌లోనే ఉంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈయన...హుజూర్‌నగర్ బరిలోనే దిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ రాజకీయ పరిస్తితులని గమనిస్తే సైదిరెడ్డిపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది ఉత్తమ్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: