హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పంచ్‌ల పేర్ని పనితీరు ఎలా ఉంది?

పేర్ని నాని....జగన్ క్యాబినెట్‌లో సమాచార, సినిమాటోగ్రఫీ, రవాణా శాఖ మంత్రి. పేర్ని అంటే పంచ్....పంచ్ అంటే పేర్ని...ప్రత్యర్ధులని తన వెటకారపు పంచ్‌లతో ఒక ఆట ఆడుకుంటారు. జగన్ ప్రభుత్వంపై గానీ, తనపై గానీ ఏమైనా విమర్శలు వస్తే..నోరు వేసుకుని పడిపోరు..జస్ట్ సింపుల్‌గా చిన్న పంచ్‌లతో ప్రత్యర్ధులకు చెక్ పెట్టేస్తారు. అసలు కృష్ణా జిల్లా వెటకారమంతా ఈయనలోనే కనబడుతుందనే చెప్పాలి. ఈయన మాట్లాడుతుంటే....పొగుడుతున్నారో, తిడుతున్నారో కూడా అర్ధం కాదు. అంటే అలా ఉంటుంది నాని వెటకారం.
సరే మాటల్లోనే కాదు...మంత్రిగా కూడా నాని అదరగొడుతున్నారా? అంటే మంత్రిగా కూడా మాటలు చెప్పే కాలం గడిపేస్తున్నట్లు కనిపిస్తోంది. సమాచార శాఖ మంత్రిగా...క్యాబినెట్ సమావేశం జరిగాక ఆ వివరాలని మీడియాకు తెలియజేస్తారు. సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించి...ఇటీవల సినిమా టిక్కెట్ల అంశంలో నాని ఏ విధంగా హైలైట్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఈయన సినిమాటోగ్రఫీ మంత్రిగా సినిమా టిక్కెట్ల కోసమే ఉన్నట్లు కనిపిస్తున్నారు.
అటు రవాణా శాఖకు సంబంధించి అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు....కాకపోతే కార్మికులు పూర్తిగా సంతృప్తిగా ఉన్నట్లు కనబడటం లేదు. అయితే నాని శాఖలకు సంబంధించిన పనులు కంటే.....మీడియాలో పంచ్‌లు వేయడానికే ముందు ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా పేర్ని తనయుడు అన్నీ విషయాల్లోనూ తలదూరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అసలు మంత్రిగా పేర్ని పని ఏం చేస్తున్నారో అందరికీ క్లారిటీ వచ్చిందనే చెప్పొచ్చు.
ఇక ఎమ్మెల్యేగా..మచిలీపట్నం నియోజకవర్గాన్ని నాని ఎలా ముందుకు తీసుకెళుతున్నారు? అంటే ఇంకా మచిలీపట్నం ముందుకెళ్లినట్లు కనిపించడం లేదు. అభివృద్ధిలో అడుగునే ఉంది. రోడ్ల పరిస్తితి దారుణం. కాస్త వాన పడితే...బందరు బస్టాండ్ కాస్త చెరువు అన్నట్లు తయారవుతుంది. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. కొద్దిపాటి వర్షాలకే రోడ్లు మునిగిపోయే పరిస్తితి.
సురక్షితమైన తాగునీరు అందడం కష్టమే. మచిలీపట్నం రూరల్ ప్రాంతాల్లో అభివృద్ధి అస్సాం. ఇంకా బందరు ప్రజల చిరకాల కల పోర్టు...ఇప్పటిలో నెరవేరేలా లేదు. అదిగో పనులు చేసేస్తున్నామని అంటున్నారు గానీ, ఇంతవరకు పోర్టు ముందుకెళ్లడం లేదు. కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్నా సరే ఇక్కడ పెద్ద పెద్ద సంస్థలు ఏమి రాలేదు...ఏ చిన్న ఉద్యోగమైన విజయవాడ వెళ్లాల్సిన పరిస్తితి. ఎక్కువ సముద్ర తీరం ఉన్నా సరే...పర్యాటకంగా అభివృద్ధి తక్కువే. ఇంకా బందరులో చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే పథకాల పరంగా పేర్నికి ప్లస్ ఉంది.
రాజకీయంగా కూడా పేర్ని బలమైన నాయకుడు...మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. మంత్రిగా ఉన్నా సరే సామాన్యుడుగా పనిచేసే తత్వం ఉంది. ప్రజలతో కలిసిపోతారు. అందుకే బందరు ప్రజలు పేర్ని సింపుల్‌సిటీకి ఫిదా అవుతారు. బందరులో ఏ సామాన్యుడైన సరే పేర్నిని కలిసే అవకాశం ఉంది. అటు ఆయన తనయుడుకు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ఇక అపోజిట్‌లో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా దూకుడుగా పనిచేస్తున్నారు. రెండున్నర ఏళ్లలో ఆయన బాగా పికప్ అయ్యారు. పైగా పలుసార్లు అరెస్ట్ కావడం వల్ల కొల్లుకు సానుభూతి పెరిగింది. వచ్చే ఎన్నికల్లో పేర్నికి కొల్లు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఒకవేళ టీడీపీకి జనసేన సపోర్ట్ ఇస్తే పేర్నికి చెక్ పడే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: