హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మధుసూదన్ సైకిల్‌ని సైడ్ చేసేస్తారా?


వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి...చిత్తూరు జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. 2014లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలైన మధుసూదన్, 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచాక బియ్యపు దూకుడు ప్రదర్శిస్తున్నారు. నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నారు. ప్రతి గ్రామం తిరుగుతూ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నారు.


నియోజకవర్గంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ కేర్ సెంటర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అటు శ్రీకాళహస్తి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ముక్కంటి ఆలయం నుంచి తొట్టంబేడు మండల పరిధిలోని అర్ధనారీశ్వర ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేయడానికి అనుమతి తీసుకొచ్చారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో సి‌సి రోడ్లు, డ్రైనేజ్ పనులు చేయిస్తున్నారు. మురికి నీటి శుద్ధి ప్లాంటు పనులు మొదలుపెట్టారు. తుడా, శ్రీకాళహస్తి పురపాలక సంఘం సహకారంతో స్వర్ణముఖి సుందరీకరణ చేయడం కోసం కృషి చేస్తున్నారు.


ఇక ఈయన అప్పుడప్పుడు వెరైటీ పనులు కూడా చేస్తుంటారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ పెట్టి జాతీయ మీడియాకు ఎక్కారు. అయితే కరోనా కల్లోలంలో ప్రభుత్వానికి సాయం అందించిన దాతలు ఫోటోలని ట్రాక్టర్లల్లో పెట్టి ఊరేగించారు. అలా భారీ ర్యాలీ పెట్టిన బియ్యం బాగా హైలైట్ అయ్యారు. ఇటు అసెంబ్లీలో కూడా బియ్యం, ప్రతిపక్ష టీడీపీపై దూకుడుగానే వెళుతున్నారు. మొన్న ఆ మధ్య నారా లోకేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి హల్చల్ చేశారు.


అయితే ఇప్పుడు తిరుపతి పార్లమెట్ ఉప ఎన్నిక వచ్చింది. శ్రీకాళహస్తి, తిరుపతి పరిధిలోనే ఉంది. దీంతో అక్కడ వైసీపీ అభ్యర్ధికి భారీ మెజారిటీ రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మొన్న ఎన్నికల్లో ఇక్కడ మధుసూదన్‌కు 38 వేల మెజారిటీ వచ్చింది. ఇక ఇప్పుడు అంతకంటే మంచి మెజారిటీ రావాలని కష్టపడుతున్నారు. అటు టీడీపీ తరుపున gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్ రెడ్డి కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. తాజాగా చంద్రబాబు శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి భారీగానే స్పందన వచ్చింది. అయితే ఎంత స్పందన ఉన్నా, జనం వైసీపీ వైపే ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి శ్రీకాళహస్తిలో బియ్యపు సైకిల్‌ని సైడ్ చేస్తారో లేదో?   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: