హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కరోనాతో బాగా ఫేమస్ అయింది ఈ ఎమ్మెల్యేనే..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ఏపీలో ఓ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాగా ఫేమస్ అయ్యారు. ఏపీలో నిదానంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆ ఎమ్మెల్యే ట్రాక్టర్లతో భారీ ర్యాలీ పెట్టి జాతీయ మీడియాకు ఎక్కారు. లాక్ డౌన్ సమయంలో దేశమంతా సామాజిక దూరం పాటించాలని గగ్గోలు పెడుతున్నా కూడా, ఈ ఎమ్మెల్యే కరోనా కల్లోలంలో ప్రభుత్వానికి సాయం అందించిన దాతలు ఫోటోలని ట్రాక్టర్లల్లో పెట్టి ఊరేగించారు. అలా భారీ ర్యాలీ పెట్టిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేని జాతీయ మీడియా ఏకీపారేసింది.

 

కరోనా సమయంలో ఇలాంటి కార్యక్రమాలు ఏంటని నేషనల్ మీడియాతో పాటు, తెలుగు మీడియా, ఏపీలో ఉన్న ప్రతిపక్ష టీడీపీ నేతలు ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆ ఎమ్మెల్యే తగ్గకుండా ప్రజల కోసం పనిచేసుకుంటూ ముందుకెళ్లారు. అలా ప్రజల మధ్యలో తిరుగుతూనే ఇప్పుడు కరోనా తెచ్చుకున్నారు. ఈ విధంగా జాతీయ మీడియాకు ఎక్కి బాగా ఫేమస్ అయిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఎవరో కాదు...చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.

 

జగన్ వీరాభిమాని అయిన మధుసూదన్ 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరుపున శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల తనయుడు సుధీర్ రెడ్డిని చిత్తుగా ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మధుసూదన్..నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నారు. ప్రతి గ్రామం తిరుగుతూ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నారు.

 

లాక్‌డౌన్ సమయంలో పేదలని ఆదుకున్నారు. అటు శ్రీకాళహస్తి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ముక్కంటి ఆలయం నుంచి తొట్టంబేడు మండల పరిధిలోని అర్ధనారీశ్వర ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేయడానికి అనుమతి తీసుకొచ్చారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో సి‌సి రోడ్లు, డ్రైనేజ్ పనులు చేయిస్తున్నారు. మురికి నీటి శుద్ధి ప్లాంటు పనులు మొదలుపెట్టారు. తుడా, శ్రీకాళహస్తి పురపాలక సంఘం సహకారంతో స్వర్ణముఖి సుందరీకరణకు రూ.14.5 కోట్లు వెచ్చించారు. నది కట్టను పటిష్టం చేసి థీమ్‌ పార్కులు, సెల్ఫీ స్పాట్‌లు, అమ్యూజ్‌మెంటు పార్కులు, జిమ్‌ వంటి సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు.

 

ఇక శ్రీకాళహస్తిలో మధుసూదన్ స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అటు టీడీపీ తరుపున gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల తనయుడు సుధీర్ కూడా యాక్టివ్ గానే పనిచేసుకుంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో కార్యకర్తలని కలుపుకునిపోతూ, పార్టీని బలోపేతం చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో ఎన్ని పనులు చేసినా...హైలైట్ కాని మధుసూదన్ కరోనా సమయంలో ట్రాక్టర్ల ర్యాలీ పెట్టి జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కూడా కరోనాతో బాధపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: