కొబ్బరి నీళ్ళతో తేనె కలిపి తీసుకుంటే కలిగే అద్భుతాలు !

Seetha Sailaja
మండుతున్న వేసవికాలంలో ఎండ వేడి తగ్గించుకోవడానికి కొబ్బరి నీళ్ళను తాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. కొబ్బరి నీళ్ళు అనేక పోషకాలు కలిగిన సహజపానీయం మాత్రమే  కాకుండా ఈ కొబ్బరి నీళ్ళ వల్ల అనేక  ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. ప్రస్తుతం మన మంతా వ్యాది రహితమైన జీవన శైలిని కోరుకుంటున్న సమయంలో అనేక వ్యాధులు నివారించడానికి ఈకొబ్బరి నీళ్ళు సహకరిస్తాయి. అయితే కేవలం కొబ్బరి నీళ్ళు మాత్రమే కాకుండా ప్రతిరోజు ఉదయం కొబ్బరినీళ్లు తేనెను కలిపి తీసుకుంటే సమకూరే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్న వారు కొబ్బరి నీళ్ళలో విధిగా తేనెను  కలుపుకి తీసుకుంటారు. 

తాజా కొబ్బరి బొండం నుంచి సేకరించిన నీటికి 1 టేబుల్ స్పూను తేనెను జోడింఛి ఈ రెండు పదార్ధాలు బాగా కలిసిపోయే విధంగా మిక్స్ చేసిన తరువాత ఆనీటిని తాగిన వారికి అనేక పోషకాలు శరీరానికి లభ్యం అవుతాయి. వృద్ధాప్యం అనేదిమన శరీరానికి రాదు అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. అంతేకాదు కొబ్బరినీళ్లతో తేనెను కలిపి ప్రతిరోజూ తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి మన శరీరం అనేక వ్యాధుల వ్యాప్తికి దూరంగా ఉంటుంది.  తేనెలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, కొబ్బరినీళ్లలో ఉన్న విటమిన్-సి ఈ రెండు కారకాలు ఒక్కటిగా కలిసి మీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

సాధారణంగా చాలమంది నిద్ర లేచాక ఒక కప్పు కాఫీతో తమ దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే దీర్ఘకాలంగా కొనసాగే ఈ కాఫీ అలవాటు వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. కనుక ఉదయాన్నే కాఫీ బదులు కొబ్బరినీళ్లను తేనెను కలిపిన ఈ పానీయాన్ని తీసుకుంటే మనకు కావల్సిన శక్తిని అందించి మనలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. కొబ్బరినీళ్లు, తేనెతో తయారు చేసిన పానీయంతో జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి. దానితోపాటే మలబద్దకాన్ని కూడా నివారించి మనకు ఉపశమనాన్ని కూడా కలగజేస్తుంది. 

ఈ పానీయంలో ఉన్న ఫైబర్, ప్రేగుల మలంలో గల నిక్షేపాలను సరళతరం చేస్తూ బయటకు పోయేలా సహకరిస్తుంది. అంతేకాదు తేనెతో కలిపి తీసుకున్న ఈపానీయం వల్లమూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడే సమస్యను నివారించడమే కాకుండా అనేక రకాల కిడ్నీ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా కొబ్బరినీళ్ళు తేనె తీసుకోవడం వల్ల రక్తంలోని చెక్కర స్థాయిలను తగ్గించడమేకాక మధుమేహమును నివారించవచ్చని పలు అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. కాబట్టి అందరు ఈవేసవిలో కొబ్బరి నీళ్ళను తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యాన్ని పొందవచ్చు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: