కొబ్బరి అన్నం రుచిగా రావాలంటే?.. ఇలా ట్రై చేయండి..!

lakhmi saranya
మన తెలుగేళ్లలో అనేక రహాల స్పెషల్ ఆహారాలు అందుబాటులో ఉన్నాయి . కొన్నిటిని మనం ఇంట్లో కూడా వండుకుంటున్నాం . వాటిల్లో కొబ్బరి అన్నం కూడా ఒకటి . మన తెలుగువారు దీనిని ఎంతగానో ఇష్టపడతారు . దీనిని రుచించేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు ‌. కానీ కొందరికి దీనిని చేయడం పెద్దగా కుదరకపోవచ్చు . కానీ ఇప్పుడు చెప్పబోయే విధంగా కొబ్బరి అన్నం చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు . కొబ్బరి అన్నాన్ని ఏ విధంగా తయారు చేయాలో మనం ఎప్పుడు తెలుసుకుందాం .

ముందు కావాల్సిన పదార్థాలు.. కొబ్బరి తురుము, కొబ్బరి పాలు , బియ్యం, పచ్చిమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఉప్పు, నూనె అదే విధంగా నెయ్య . ముందుగా ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల కొబ్బరిపాలు పోసి వండుకోండి . మెత్తగా కావాలంటే అర కప్పు నీళ్లు కూడా పోసుకోవచ్చు . నీళ్లతో వండిన కూడా బానే ఉంటుంది ‌. కొబ్బరి పాలతో రుచి మరింత బాగుంటుందని చెప్పుకోవచ్చు . ఈ అన్నాన్ని పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నూనె వేసి అనంతరం కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి .

నూనె వేడి అయినా అనంతరం జీలకర్ర మరియు ఆవాలు అదేవిధంగా మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి . ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే జీడిపప్పు మరియు కరివేపాకు , పచ్చిమిర్చి, మిరియాలు, ఇంగువ వేసుకుని కలుపుకోవాలి . ఇవన్నీ వేగిన తరువాత పచ్చి కొబ్బరి తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి . తరువాత ఉప్పు కలుపుకోవాలి . ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం వేసి బాగా కలుపుకోవాలి . మీకు ఇష్టం ఉంటే పైన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు . అంతే రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది . మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి సక్సెస్ అవ్వండి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: