
ఈ 5 రాశుల అమ్మాయిల్ని ప్రేమలో పడేయడం అంత సులభం కాదు.. వాళ్లు ఎవరంటే..?
* సింహ రాశి (Leo) (జూలై 23 - ఆగస్టు 22)
సింహ రాశి అమ్మాయిల రూలే వేరు. వాళ్ళకి కొన్ని స్ట్రాంగ్ నమ్మకాలు, ప్రేమలో హై స్టాండర్డ్స్ ఉంటాయి. చాలా సెలెక్టివ్‌గా ఉంటారు. పార్టనర్ విషయంలో వాళ్లకు కొన్ని క్లియర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. పొగడ్తలు, అటెన్షన్ అంటే ఇష్టమే కానీ, ఊరికే చేసే పొగడ్తలకు పడిపోరు. ప్రేమలో పడటానికి చాలా టైమ్ తీసుకుంటారు. తమని గౌరవించే, విలువ ఇచ్చే వ్యక్తిని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుంటారు.
* కుంభ రాశి (Aquarius) (జనవరి 20 - ఫిబ్రవరి 18)
కుంభ రాశి అమ్మాయిలు ఉంటారే.. వాళ్లు మహా స్వేచ్ఛా ప్రియులు. స్వతంత్రంగా బతకడానికే ఎక్కువ ఇష్టపడతారు. వాళ్ల తెలివితేటలు మామూలుగా ఉండవు. ఏదైనా చాలా లోతుగా ఆలోచిస్తారు. తొందరపడి ఏ ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోరు. ఎవరైనా ప్రేమ కోసం వెంట పడినా, వాళ్లు మాత్రం తమ లక్ష్యాలు, కలలపైనే ఫోకస్ పెడతారు. ప్రేమ అనేది వాళ్లకి ఒక డిస్ట్రాక్షన్ లా అనిపిస్తుంది. అందుకే వాళ్ళ మనసు గెలవాలంటే చాలా టైం, ఓపిక కావాలి మరి.
* మేష రాశి (Aries) (మార్చి 21 - ఏప్రిల్ 19)
మేష రాశి అమ్మాయిలు చాలా ధైర్యంగా, దూకుడుగా, ప్యాషన్‌తో ఉంటారు. ఏదైనా సరే సక్సెస్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. తక్కువతో అస్సలు రాజీపడరు. ప్రేమ కావాలని కోరుకున్నా, ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకుంటారు. హడావిడిగా రిలేషన్‌షిప్స్‌లోకి దూరిపోరు. తమ స్ట్రాంగ్ పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యే సరైన వ్యక్తి కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళ హృదయాన్ని గెలవాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి, నిజమైన కనెక్షన్ ఉండాలి.
* మకర రాశి (Capricorn) (డిసెంబర్ 22 - జనవరి 19)
మకర రాశి అమ్మాయిలు చాలా ప్రాక్టికల్‌గా, కెరీర్ ఓరియెంటెడ్‌గా ఉంటారు. వాళ్ళ ఫోకస్ అంతా గోల్స్ మీదే ఉంటుంది. లవ్ అనేది వాళ్ళ ప్రయారిటీ లిస్టులో ఉండదు. ఎప్పుడూ ఫ్యూచర్ ప్లానింగ్‌లో బిజీగా ఉంటారు. ఎమోషన్స్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. ఎవరినీ అంత తొందరగా లోపలికి రానివ్వరు. వాళ్ళ హృదయాన్ని గెలవాలంటే ఓపికగా ఉండాలి, కన్సిస్టెంట్‌గా ఉండాలి, వాళ్ళ డ్రీమ్స్‌ని రెస్పెక్ట్ చేయాలి.
* వృశ్చిక రాశి (Scorpio) (అక్టోబర్ 23 - నవంబర్ 21)
వృశ్చిక రాశి అమ్మాయిలు తమ ఫీలింగ్స్‌ని చాలా దాచిపెడతారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరినీ అంత ఈజీగా నమ్మలేరు. ఓపెన్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలంటే చాలా ఆలోచిస్తారు. ఎవరైనా నచ్చినా, వెంటనే దూసుకుపోరు. వాళ్ళ నమ్మకాన్ని గెలవడమే ప్రేమను గెలవడానికి కీ పాయింట్.
ఈ ఐదు రాశుల అమ్మాయిలు తమ స్వేచ్ఛకు, నమ్మకానికి, పర్సనల్ గోల్స్‌కి ఎక్కువ విలువ ఇస్తారు. వాళ్ళ ప్రేమను గెలవాలంటే టైమ్ పడుతుంది, ఎఫర్ట్ పెట్టాలి, నిజమైన డెడికేషన్ చూపించాలి.