థైరాయిడ్ నుంచి చెడు కొలెస్ట్రాల్ వరకు.‌.. దేన్నైనా ఈజీగా తగ్గించే నట్స్..!

frame థైరాయిడ్ నుంచి చెడు కొలెస్ట్రాల్ వరకు.‌.. దేన్నైనా ఈజీగా తగ్గించే నట్స్..!

lakhmi saranya
బాదంపప్పులో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డైలీ వీటిని తినటం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. రాత్రిపూట బాదాం నీ నానపెట్టుకుని ఉదయాన్నే తినటం మంచిది. బాధమనే కాదు డ్రై ఫ్రూట్స్ అన్నిటిని తినటం మంచిది. మీరు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే హాజెల్ నట్స్ ఆహారంలో చేర్చుకోండి. ఎఫ్ డిఏ 2003 నివేదిక ప్రకారం, హాజెల్ గింజలు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి ప్రతిరోజు గుప్పెడు హాజెల్ నట్స్ తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
మకాడమియా గింజలలో మోనోశాచ్యురేటెడ్ కొవ్వు, ప్రోటీన్, శక్తి పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు మకాడమియా తినటం ఉపయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో పెరుగుతున్న చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పరిమాణాన్ని పెంచుతుంది. ఇది సూపర్ మార్కెట్లలో, ఈ కామర్స్ సైట్లలో ఈ నట్స్ దొరుకుతుంటాయి. మీరు ప్రతిరోజు కొన్ని నట్స్ తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాగే వాల్నట్స్ లో ఉండే ఒమేగా 3 బ్యాట్ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అయితే పిల్లలతో పాటు పెద్దలకు కూడా జ్ఞాపకశక్తికి పదును పెట్టాలనుకుంటే రోజు వాల్నట్స్ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి డైలీ కూడా ఈ వాల్నట్స్ ని తప్పకుండా తినండి. బాదం, వాల్నట్స్ వంటి నట్స్ ఎన్నో రకాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినే పద్ధతి ఎంతోమందికి తెలియదు. అలాగే ఆరోగ్య సమస్యను బట్టి మీరు నట్స్ ఎంపిక చేసుకోవాలి. కేవలం బాదం, పిస్తా, జీడిపప్పులు వంటివే కాదు ఆరోగ్యానికి మేలు చేసే గింజలు ఎన్నో ఉన్నాయి. శరీరంలోని వివిధ సమస్యలను బట్టి ఎంపిక చేసుకుని తినాలని వైద్యులు ప్రిఫర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: