హైకొలెస్ట్రాల్ సమస్య... ఈ నూనెలు వాడితే నో రిస్క్!

frame హైకొలెస్ట్రాల్ సమస్య... ఈ నూనెలు వాడితే నో రిస్క్!

lakhmi saranya
ఏజ్ తో సంబంధం లేకుండా హై కొలెస్ట్రాల్, హై బీపీ, హార్ట్ ఎటాక్ వంటి ప్రాబ్లమ్స్ ఇటీవల పెరుగుతున్నాయి. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు కూడా ఎందుకు కారణం అవుతున్నాయి. పైగా బాడీలో బాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాలు, సిరలు బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది గుండె జబ్బుల ముప్పును పెంచుతుంది. అయితే ఈ సమస్యలన్నిటికీ మనం రోజు వంట చేయడానికి వాడే కొన్ని నూనెలు కూడా కారణం అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అధిక కొవ్వులు కలిగిన రీఫైన్డ్ ఆయిల్స్ కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసేవి వాడితే బెటర్ అంటున్నారు నిపుణులు.
 అలాంటి ఆయిల్స్ ఏవో చూదాం. ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కాబట్టి ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే జుట్టు, సంరక్షణకు ఇది సహాయపడుతుంది. ఆలివ్ నూనెలో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బాడీలోని ప్రతి అవయవానికి మేలు చేస్తాయని, బాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేరుశెనగలు యాంటీ సెప్టిక్, ఆస్ట్రిజెంట్, యాంటి స్పాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు. అయితే శీతాకాలంలో చాలా నూనెలు గడ్డ కడుతుంటాయి. కానీ వేరుశెనిగ నూనె కట్టదని చెప్పారు.
ఈ సీజన్ లో వాడటం వల్ల శరీరాన్ని పచ్చగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. నువ్వుల నూనె గుండె జబ్బులు ఉన్నవారికి మేలు చేస్తుందని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సంతృప్త కొవ్వులు, మోనోశాచురేటెడ్, పాలి అన్శాచురేటెడ్ కొవ్వులు శరీరానికి మేలు చేస్తాయి. ఇది మొత్తం గుండె ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా చలికాలంలో తినటం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉండటం వల్ల కొలెస్ట్రాలను అదుపులో ఉంచడానికి అవకాడో ఆయిల్ సహాయపడుతుంది. కాబట్టి బాడీలోని ప్రతి అవయవానికి మేలు చేస్తాయని, బాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: