ఇబ్బందులు వస్తే రానీ.. మమ్మల్ని తీర్చిదిద్దుతాయ్..!

lakhmi saranya
సందర్భమేదైనా సరే ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడి పారిపోకండి. కష్టాలకు ఎదురోడ్డి నిలవండి అంటారు పెద్దలు. ఎందుకంటే అవి మనల్ని అలర్ట్ చేస్తాయి. సమస్యల సుడిగుండంలా నుంచి బయటపడటం ఎలాగో ఆలోచించేలా చేస్తాయి. ఆత్మ స్థైర్యాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. అందుకే ఇబ్బందులను ఎదుర్కొన్న వారు ఎందులోనైనా రాటుదేలుతారు. సందర్భం వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలో, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో అని అనుభవాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అసలే చలికాలం పొద్దున్న జర్నీ చేయాల్సి వచ్చింది. కానీ చలి పెడుతుందనే విషయాన్ని మర్చిపోయి అలాగే బయలు దేరుతారు. ఇకముంది శరీరంలో వణుకు మొదలవుతుంది.
అప్పుడు అనిపిస్తుంది మీకు ' అయ్యో స్వెటర్ వేసుకుని రావాల్సిందనో, కాస్త లేట్ అయిన బయలు దేరాల్సిందనో" ఇక ముందు మార్నింగ్ ప్రయాణం చేయాల్సి వస్తే ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుని ఆలర్ట్ అవుతారు. అంటే ఒక ఇబ్బందికరమైన అనుభవం మిమ్మల్ని ఎలా అలెర్ట్ చేసింది కాదూ! మొత్తానికి మరోసారి అవస్థలు పడకుండా జాగ్రత్త పడేలా గుణపాఠం నేర్పండి. జీవితంలో మీకు ఎదురయ్యే కష్టాలు, ఇబ్బందులు కూడా అంతే. మనకు ఏదో ఒకటి నేర్పిస్తాయి. అవి చాలా వరకు మిమ్మల్ని తీర్చిదిద్దుతాయని, అనుభవాన్ని, జ్ఞానాన్ని ఇస్తాయని ఇప్పుడునులు శాతం చెబుతున్నారు.
తెలుసో తెలియకో మనం గాని, ఇతరులుగా చేసిన పొరపాట్లు, మీరు ఎదుర్కొన్న అవమానాలు, మొహమాటలు, బాగుంది వేగాలు అంటే ప్రవర్తనలు కూడా కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెట్టేవిగా అనిపిస్తుంటాయి. కానీ అనేక విషయాల్లో అవి మనల్ని అప్రమత్తం చేస్తాయి. ఎవరితో ఎలా వ్యవహరించాలో నేర్పిస్తాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసన్ జర్నల్ స్టడి ప్రకారం... ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, నష్టాలు వంటివి ప్రతికూలతలుగా భావిస్తుంటారు చాలామంది. అవి మంచిది కాదని కూడా చెబుతుంటారు. కానీ మానవ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే... అది మానవుని నుంచి ఆధునిక మానవుడి వరకు ప్రతి ఇబ్బంది నుంచి మనిషి ఒక గుణపాఠం నేర్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: