సంబంధాల్లో సంతోషం మిస్..! కారణం ఇదేనా..?
అది ప్రమాదకరణ ధోరణిగా పేర్కొంటున్నారు. నిజానికి ఇతరులు బయటకు కనిపించే విధంగానో, సోషల్ మీడియాలో, సినిమాల్లో కనిపించే పొకడల మాదిరిగానో వారి నిజ జీవితాలు ఉండకపోవచ్చు. పైకి గొప్పగా కనిపించిన వారి విషయంలోనూ అనేక లోపాలు ఉండవచ్చు. సమస్యలతో సతమతం అవుతుండవచ్చు. కాబట్టి సమాజంలో ఎవరిని ' సంపూర్ణ' వ్యక్తులుగానో, వారి జీవితాలు పర్ ఫెక్ట్ భావించడం, తమను వారితో కంపేర్ చేసుకోవటం సంతోషాన్ని దూరం చేస్తుంది. సంబంధంలో ఇద్దరూ వ్యక్తుల మధ్య ఎవ్వరూ ఈ పొరపాటు చేసిన ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది.
ఇటీవల ఇలాంటి విషయాలే విడాకులకు కూడా కారణం అవుతున్నాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి మీ జీవితం మీద... ఇతరులతో పోల్చుకోని ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. ప్రేమ లేదా సంబంధం జీవితంలో చాలా విలువైనది. అంతేకాకుండా ఇది భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. అర్థం చేసుకున్నప్పుడు లైఫ్ సంతోషంగా ఉంటుంది. అయితే ఒక సంబంధం లోకి అడుగు పెట్టాక భాగస్వామి మీతో బాగానే ఉంటున్న అనుమానించడం, అవతలి వ్యక్తి గతాన్ని తవ్వడం, చిన్న చిన్న పొరపాట్లను కూడా పెద్దవిగా చూస్తూ తప్పఒట్టడం వంటివి సంబంధాన్ని విచ్చన్నం చేస్తాయి. ఇలాంటి విషయాల్లో మీ అత్యుత్సాహం చివరికి విడాకులకు, బ్రేకప్ లకు దారి తీయవచ్చు. కాబట్టి గతాన్ని పక్కన పెట్టేసి వర్తమానంలో ఏంటనేది ఆలోచిస్తే... మీ సంబంధం సంతోషంగా ఉంటుంది.