సెలబ్రిటీలపై అభిమానం ఎక్కువైతే కలిగే నష్టాలు ఏంటి..?

frame సెలబ్రిటీలపై అభిమానం ఎక్కువైతే కలిగే నష్టాలు ఏంటి..?

lakhmi saranya
ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హీరో అంటే లేదంటే ఒక్కో హీరోయిన్ అంటే మరీ ఇష్టపడతారు. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఇష్టం గానే ఉంటారు. ఫలానా హీరో లేదా హీరోయిన్ అంటే మికిష్టమా...? అభిమాన నటి నటుల సినిమాలు చూడకుండా, వారిని సోషల్ మీడియాలో ఫాలో అవ్వకుండా క్షణం కూడా ఉండలేకపోతుంటారా? వారి సినిమాలో రిలీజ్ అవ్వగానే ప్రాణాలకు తెగించి మరీ చూసే ప్రయత్నం చేస్తుంటారా? బాగో లేకున్నా బాగుందని మెచ్చుకుంటున్నారా? అభిమాన నటులను గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతున్నారా? వారికోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే రకమా ? అయితే మీరు సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లే.. అంటున్నారు నిపుణులు.
అభిమానం, ఆరాధనా బావ ఉండటంలో తప్పులేదు. కానీ మోతాదు మించితేనే పిచ్చిలా మారిపోతుంది చెబుతున్నారు. దాన్ని లక్షణాలు, ప్రభావాలు, పర్యావసనాలు ఏమిటో చూద్దాం. ఒక వ్యక్తిని లేదా సెలబ్రిటీని అతిగా ఆరాధించే ప్రవర్తనకు దారి తీసే సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోం మీ వ్యక్తిగత, సామాజిక జీవితం పై ప్రభావం చూపుతుంది. మిమ్మల్ని మానసిక బలహీనులుగా మారుస్తుంది. భ్రమలకు లోను చేస్తుంది. ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తులు తాము అభినమానించే సెలబ్రిటీలాగే రెడీ అవ్వడం, అలాంటి దుస్తులే ధరించడం, వారిలా మాట్లాడడం, ప్రవర్తించడం వంటివి అనుకరిస్తుంటారు. అంతేకాకుండా అభిమాన సెలబ్రెటీ కోటేషన్లను ఇతరులకు పంపడం, ఫ్రెండ్స్ కు చదివి వినిపించడం వంటివి కూడా చేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే తాము ఫాలో అయ్యే సెలబ్రిటీ చేసేది, చెప్పేది వాస్తవాలతో సరిపోల్చకుండా అన్నీ కరెక్టేనని నమ్మేస్తుంటారు.
తమ హీరో లేదా హీరోయిన్ తప్పు చేసిన సమర్థించడం, వారికేమైనా జరిగితే బాధపడడం, కొన్ని సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్ చేయడం వంటివి సెలబ్రెటీ వర్షిప్ సిండ్రోం రుగ్మతలో భాగామే అంటున్నారు మానసిక నిపుణులు. సెలబ్రిటీ వర్షిప్ అనే పదాన్ని మొదటిసారిగా 2000 సంవత్సరంలో డాక్టర్ లీన్ మెక్ కట్చియోన్ తన సహచరులతో కలిసి రూపొందించారు. ఆరాధన భావం, అది అభిమానం మనుషులను ఎలా ప్రభావితం చేస్తుందో వీరు పరిశోధించారు. అయితే ఇది రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రెటీల పట్ల కలిగి ఉండే భావన గా ఉంటొన్నప్పటికి ఎక్కువగా తిని తారలతో ముడిపడి ఉందని గుర్తించారు. తమ అభిమాన తారల వ్యక్తిగత జీవితాలపట్ల ఆసక్తి కలిగి ఉండటం, టీవీలు, ఫోన్లు, మీడియా, వివిధ సామాజిక మధ్యమాల ద్వారా అనుసరించడం, ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశాల కోసం ఎదురు చూడటం వంటివి ఈ రుగ్మతతో బాధపడే వ్యక్తుల్లో తీవ్రస్థాయి భావాలుగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: